fbpx
HomeMovie Newsరవితేజ చేతులమీదుగా 'సీతాయణం' టీజర్

రవితేజ చేతులమీదుగా ‘సీతాయణం’ టీజర్

Seethayanam TeaserLaunchBy Raviteja

సాండల్వుడ్: ఒకప్పటి కన్నడ హీరో శశికుమార్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ బాషా సినిమాలో రజినీకాంత్ తమ్ముడిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన నటుడు అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఆయన నట వారసుడిగా ఆయన తనయుడు అక్షిత్ శశికుమార్ ‘సీతాయణం’ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాతో ఒకేసారి తెలుగు మరియు కన్నడలో పరిచయం అవబోతున్నాడు. ప్రభాకర్ అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ దర్శకుడు ఇదివరకు వై వీ ఎస్ చౌదరి వద్ద అసిస్టెంట్ గా పని చేసాడు. అక్షిత్ సరసన అనహిత భూషణ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా టీజర్ ని టాలీవుడ్ హీరో రవి తేజ చేతులమీద విడుదల చేయించారు.

‘కామి గాని వాడు మోక్షగామి కాలేడు’ అనే డైలాగ్ తో ఈ టీజర్ ఆరంభం అయింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలాగానే టీజర్ ఉంది. హీరో కూడా భారీ యాక్షన్ స్టంట్స్ తో తన సినీ ప్రయాణం ప్రారంభించాడు. పద్మనాభ్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. మామూలుగా రాముడి కథ అంటే రామాయణం అని అంటాము కానీ ఎక్కడా కూడా సీతాయణం అని అనలేదు. రెస్పెక్ట్ విమెన్ అనే ట్యాగ్ లైన్ తో ఆడవాళ్ళని గౌరవించడం లాంటి కాన్సెప్ట్ తో పెట్టిన ‘సీతాయణం’ అనే టైటిల్ ఆకట్టుకుంది. రోహన్ భరద్వాజ్ సమర్పణలో కలర్ క్లౌడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి ఈ సినిమాని నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular