fbpx
HomeMovie Newsఆర్ పి పట్నాయక్ దర్శకత్వంలో 'కాఫీ విత్ కిల్లర్'

ఆర్ పి పట్నాయక్ దర్శకత్వంలో ‘కాఫీ విత్ కిల్లర్’

CoffeeWithKillerMovie Under RPPatnayakDirection

టాలీవుడ్: సంగీత దర్శకుడిగా 2000 సంవత్సరం నుండి ఒక దశాబ్దం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక ఊపు ఊపిన పేరు ‘ఆర్ పి పట్నాయక్‘. ఆ తర్వాత అన్ని పాటలు తానే పడతాడని, అలాగే కొత్త కంపోజర్స్ ఇండస్ట్రీ కి రావడం వలన ఆర్ పి పట్నాయక్ హవా కొంచెం తగ్గిపోయింది. ఆ తర్వాత నటుడిగా , నిర్మాతగా, దర్శకుడిగా, వ్యాఖ్యాత గా రకరకాల పాత్రలు పోస్తిస్తూ వస్తున్నాడు. బ్రోకర్ లాంటి సినిమాతో సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న విషయాలని కళ్ళకి కట్టినట్టు చూపించి దర్శకుడిగా కూడా మంచి పేరు సంపాదించాడు. చాలా రోజుల తర్వాత మరో సారి దర్శకుడిగా మన ముందుడు రాబోతున్నాడు ఆర్ పి పట్నాయక్.

‘కాఫీ విత్ కిల్లర్’ అనే సినిమాకి ఆర్ పి పట్నాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన టైటిల్ పోస్టర్ ఆర్ పి పట్నాయక్ విడుదల చేసాడు. సడెన్ గా పోస్టర్ విడుదల చేసి షూటింగ్ మొత్తం పూర్తి అయిందని మరి కొద్దీ రోజుల్లో మిగతా అప్ డేట్స్ ఇస్తామని కూడా ప్రకటించాడు. ఇదొక కామెడీ థ్రిల్లర్ జానర్లో రూపొందుతుందని పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు ఆర్ పి పట్నాయక్ నిర్వహించారు. ది బెస్ట్ క్రియేషన్ బ్యానర్ పై గౌతమ్ పట్నాయక్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తి అయి మరి కొద్దీ రోజుల్లో విడుదల అవడానికి ఈ సినిమా సిద్ధంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular