fbpx
HomeMovie Newsసంక్రాంతికి వస్తున్న 'అల్లుడు అదుర్స్'

సంక్రాంతికి వస్తున్న ‘అల్లుడు అదుర్స్’

BellamKondaSaiSrinivas AlluduAdurs ReleasingOnSankranthi

టాలీవుడ్: తెలుగు వాళ్ళకి సంక్రాంతి అంటే పెద్ద పండగ. కేవలం జనాలకి మాత్రమే కాకుండా సినిమా వాళ్ళకి కూడా సంక్రాతి పెద్ద పండగ. అందుకే ఎన్ని సినిమాలు విడుదల అవుతున్నా తమ సినిమా కూడా అందులో ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి కరోనా సమయం లో కూడా ఇప్పటికి రెండు సినిమాలు విడుదల ప్రకటించాయి. అయినా కూడా ఇపుడు సంక్రాంతి రేసులో మరొక సినిమా కూడా జత కలిసింది. బెల్లం కొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘అల్లుడు అదుర్స్’. ఈ రోజే ఈ సినిమాకి సంబంధించి విడుదల తేదీ ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 15 న ఈ సినిమా థియేటర్ లలో సందడి చేయనుందని అధికారికంగా ప్రకటించారు.

కందిరీగ ఫెమ్ ‘సంతోష్ శ్రీనివాస్’ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందింది. పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో కామెడీ బేస్ గా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడీ గా నభ నటేష్ మరియు అను ఇమ్మానుయేల్ నటిస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఎలాంటి ప్రొమోషన్ ప్రారంభించని ఈ సినిమాకి డైరెక్ట్ గా విడుదల తేది ప్రకటించి షాక్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సోనూ సూద్ లాంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గొర్రెల సుబ్రహ్మణ్యం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రవితేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’ సినిమాలతో కలిపి ‘అల్లుడు అదుర్స్’ తో పాటు సంక్రాతి సందర్భంగా మూడు సినిమాలు ఇప్పటి వరకు ప్రకటించారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సక్సెస్ ని థియేటర్లలో చూసిన తర్వాత ఇంకా మున్ముందు ఇంకొన్ని సినిమాలు ప్రకటించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular