fbpx
HomeMovie Newsసెబాస్టియన్ PC 524 టీజర్ విడుదల

సెబాస్టియన్ PC 524 టీజర్ విడుదల

KiranAbbavaram Sebastian524 TeaserReleased

టాలీవుడ్: ‘రాజావారు రాణిగారు’ సినిమా ద్వారా పరిచయం అయిన నటుడు ‘కిరణ్ అబ్బవరం’. ప్రస్తుతం ‘SR కల్యాణ మండపం’ మరియు ‘సెబాస్టియన్ PC 524 ‘ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈరోజు ‘సెబాస్టియన్ PC 524 ‘ సినిమాకి సంబందించిన ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేసారు. ఈ సినిమాలో కిరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. ‘ఒక తల్లికి న్యాయం చేయడం కోసం ఇంకో తల్లికి చేసిన ప్రమాణం’ అనే లైన్ తో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. ఒక షాట్ లో చాలా దైర్యంగా ఫోన్ మాట్లాడుతూ ముందుకు నడుస్తున్న హీరో కనిపిస్తాడు. మరొక షాట్ లో కొంచెం భయపడుతూ ‘ఈ రేయి ఎలాగైనా గడిచేలా చూడు తండ్రి’ అంటూ ప్రార్దిస్తున్న మరొక పాత్రలో హీరోని చూపిస్తాడు.

ఇలా ఈ సినిమాలో కిరణ్ రెండు పాత్రలు చేయబోతున్నాడు. టీజర్ ని బట్టి చూస్తుంటే ఈ రెండు పాత్రలు ఒకే సారి జరుగుతున్నవి కాకుండా రెండు వేర్వేరు కాలాల్లో జరుగుతున్నవి అని అర్ధం అవుతుంది. అయితే ఈ రెండు కాలాలకు , వీళ్లిద్దరి పాటలకి సంబంధం ఏంటి, ఎలాంటి స్క్రీన్ ప్లే తో ఈ సస్పెన్స్ తెర తియ్యనున్నారు అనేది డైరెక్టర్ చేతిలో ఉంది. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్, టీజర్స్ ఆకట్టుకున్నాయి. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్ మరియు రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బాలాజీ సయ్యపురెడ్డి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ టీజర్ లో గిబ్రాన్ ఇచ్చిన నేపధ్య సంగీతం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాకి కూడా ఆయన సంగీతం ప్రత్యేక ఆకర్షణ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular