fbpx
HomeMovie News'ముఠా మేస్త్రి' ని గుర్తు చేస్తున్న చిరు

‘ముఠా మేస్త్రి’ ని గుర్తు చేస్తున్న చిరు

Chiru154 Firstlook Poster

టాలీవుడ్: టాలీవుడ్ లో ఎన్నో సంవత్సరాలు టాప్ హీరో పొజిషన్ లో ఉండి ఎన్నో విజయాలు అందించిన చిరంజీవి రాజకీయాలలో ఉండడం వలన 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు. తర్వాత కం బ్యాక్ మూవీ గా ‘ఖైదీ నం 150 ‘ సినిమాలో నటించాడు. తర్వాత ‘సైరా నరసింహ రెడ్డి’ సినిమాలో స్వాతంత్య్ర పోరాట యోధుడిగా నటించాడు. తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా పూర్తి చేసి విడుదలకి సిద్ధం చేసారు. ఇప్పుడు దాదాపు మూడు, నాలుగు సినిమాలో లైన్ లో ఉన్నాయి. అందులో లూసిఫెర్ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ సినిమా , వేదాళం రీమేక్ ‘భోళా శంకర్‘ సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో రూపొందనున్న మరో సినిమా ఉన్నాయి.

ఈ రోజు చిరు పుట్టిన రోజు సందర్భంగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఫస్ట్ లుక్ ఒకటి విడుదల చేసారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాని చిరు 154 అని ఒక పోస్టర్ విడుదల చేసారు. పోస్టర్ లో బీచ్ లో ఒక పడవ పైన పూర్తి మాస్ లుక్ లో అదరగొట్టాడు చిరు. ఒక్క సారి చూస్తే ముఠా మేస్త్రి చిరు గుర్తుకురావడం ఖాయం. అందరి వాడు లో ఇలాంటి ఒక పాత్రతో మెప్పించిన చిరు మరో సారి పూర్తి మాసీ రోల్ తో రానున్నట్టు అర్ధం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఒక చేతిలో బీడీ తాగుతూ మరొక చేతిలో యాంకర్ ని పట్టుకుని మాసీ లుక్ తో పూనకాలు లోడింగ్ అంటూ పోస్టర్ ప్రెసెంట్ చేసారు మేకర్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular