fbpx
HomeMovie News'గాడ్ ఫాదర్' గా రానున్న మెగా స్టార్

‘గాడ్ ఫాదర్’ గా రానున్న మెగా స్టార్

Chiru GodFather TitleAnnouncement

టాలీవుడ్: మెగా స్టార్ చిరంజీవి హీరో గా మళయాళం లో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. రేపు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల అప్ డేట్లు ఒక దాని తర్వాత ఒకటి విడుదల అవుతున్నాయి. ఇందులో మొదటగా లూసిఫర్ రీమేక్ గా రూపొందుతున్న సినిమా టైటిల్ రివీల్ చేసారు మేకర్స్. ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందనున్నట్టు ఒక పోస్టర్ కూడా విడుదల చేసారు. పోస్టర్ లో బ్యాక్ గ్రౌండ్ లో చిరు షాడో లుక్ లో హాలీవుడ్ స్పై ఏజెంట్ గెట్ అప్ లో చేతిలో గన్ పట్టుకుని చిరు కనిపించాడు. మళయాళం లో మోహన్ లాల్ పోషించిన పాత్రను చిరు పోషిస్తున్నాడు.

తెలుగు లో హనుమాన్ జంక్షన్, రామ్ చరణ్ తేజ్ ‘ధ్రువ’ ఒరిజినల్ వెర్షన్ ని తమిళ్ లో డైరెక్ట్ చేసిన మోహన్ రాజా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం టాప్ ఫార్మ్ లో ఉన్న సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో మరో ప్రత్యేక పాత్రలో యువ నటుడు సత్యదేవ్ నటిస్తున్నాడు. చిరు నటించిన 152 వ సినిమా ఆచార్య షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమా తో పాటు మెహర్ రమేష్, బాబీ ల దర్శకత్వంలో మరో రెండు సినిమాల్లో కూడా చిరంజీవి నటించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular