fbpx
HomeAndhra Pradeshకీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్!

కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్!

APCABINET-TAKES-CRUCIAL-DECISIONS-ON-SEVERAL-SCHEMES

అమరావతి: ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ నెలలో నవరత్నాలలో భాగంగా అమలు చేయనున్న పథకాలతో పాటు పలు కీలక అంశాలను అమలు చేయడానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. అందులో భాగంగా వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం 2021-22 ఏడాదికి గాను అమలు చేయడానికి ఆమోదం తెలిపింది.

నేతన్న నేస్తం పథకం ద్వారా రాష్ట్రంలో సొంత మగ్గాలపై నేత నేసే కార్మికుల కుటుంబాలకు ఏడాదికి 24 వేల రూపాయల ప్రకారం ఆర్థికసాయం అందించడానికి గాను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు కోసం బడ్జెట్‌లో రూ.199 కోట్లు కేటాయించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.

అలాగే రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం చెల్లించడానికి కూడా ఏపీ కేబినెట్‌ ఆమోదం ఇచ్చింది. అగ్రిగోల్డ్ లో 20 వేల రూపాయలు డిపాజిట్ చేసిన వారికి ఈ నెల 24వ తేదీన నష్ట పరిహారం పంపిణీ చేయడానికి కూడా కేబినేట్ అంగీకారం తెలిపింది. దీనికి గాను సుమారు రూ.500 కోట్లతో ప్రభుత్వం 4 లక్షల మందికి పంపిణీ చేయనుంది. ఇదివరకే రూ.10 వేలలోపు డిపాజిట్ చేసిన 3.4 లక్షలమంది డిపాజిట్ ‌దారులకు పంపిణీ పూర్తి చేసింది.

కేబినెట్‌ ఆమోదించిన మరికొన్ని అంశాలు:

క్లాప్ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌)‌ కార్యక్రమానికి, జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో అర్బన్, రూరల్‌ ప్రాంతాల్లో 100 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు నిర్వహణకు, ఇంటింటికీ చెత్త సేకరణ విధానంలో పూర్తి శాస్త్రీయ పద్ధతుల వినియోగం కోసం ఆమోదం తెలిపింది. రాజమండ్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు, కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి పేరు మార్పు, అభ్యంతరం లేని స్థలాల్లోని ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఆమోదం.

కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షల ప్యాకేజీకి ఆమోదం, హైకోర్టు ఆదేశానుసారం ఏపీలో లోకాయుక్త, మానవహక్కుల కమిషన్‌ కార్యాలయాలు, హైదరాబాద్‌లో ఉన్న లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలుకు తరలించాలని నిర్ణయం. రాష్ట్ర మానవహక్కుల సంఘం కార్యాలయాన్నీ కర్నూలుకు తరలించాలని నిర్ణయం.

రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో డైరెక్టర్‌ పోస్టును మంజూరు చేయడానికి కేబినెట్‌ ఆమోదం. రాష్ట్రంలో పశు సంపదను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌ బొవైనీ బ్రీడింగ్‌ ఆర్డినెన్స్‌- 2021కి కేబినెట్‌ ఆమోదం. రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తుల పెంపు ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం. రైతు భరోసా కేంద్రాల్లో విత్తన ఉత్పత్తి పాలసీ ప్రతిపాదనలకు ఆమోదం. ఉద్యాన పంటల సాగుకు సంబంధించి చట్టసవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular