fbpx
HomeAndhra Pradeshటెన్త్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ

టెన్త్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ

AP-SSC-EXAMS-SCHEDULE-RELEASED

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ రోజు పదో తరగతి పరీక్షల కు సంబంధించిన షెడ్యూల్ ‌ను విడుదల చేశారు. ఈ సంవత్సరం అంటే 2021 జూన్‌ 7 నుంచి 16 వ తేదీ వరకు పరీక్షలు జరపనున్నట్లు ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

అలాగే 2021 మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం 2021-22 ప్రారంభం కానుందని వెల్లడించారు.

ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌( ఏడు పేపర్లు) :
జూన్‌ 7(సోమవారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్‌
జూన్‌ 8( మంగళవారం) : సెకండ్‌ లాంగ్వేజ్‌
జూన్‌ 9(బుధవారం) : ఇంగ్లీష్‌
జూన్‌ 10(గురువారం) : గణితం
జూన్‌ 11 (శుక్రవారం) : ఫిజికల్‌ సైన్స్‌
జూన్‌ 12 (శనివారం) : బయోలాజికల్‌ సైన్స్‌
జూన్‌ 14( సోమవారం) : సోషల్‌ స్టడీస్‌
జూన్‌ 15 ( మంగళవారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2
ఓఎస్‌ఎస్‌సీ మేయిన్‌ లాంగ్వేజ్‌ (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)
జూన్‌ 16 ( బుధవారం ) ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు(థియరీ)

ఈ పరీక్షలన్నీ కోవిడ్ నిబంధనల మధ్య జరుగుతాయని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular