fbpx
HomeAndhra Pradeshఏపీ ఈఏపీసెట్‌ దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుండి ప్రారంభం!

ఏపీ ఈఏపీసెట్‌ దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుండి ప్రారంభం!

AP-EAPCET-APPLICATIONS-SUBMISSION-STARTS-TODAY

అమరావతి: ఏపీలో ఇదివరకు ఎంసెట్ గా పిలవబడే ప్రవేశ పరీక్ష ఇప్పుడు ఈఏపీసెట్ గా మారింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీసెట్‌–2021కు దరఖాస్తుల స్వీకరణ జూన్ 26వ తేదీ నుంచి ప్రారంభం అవనుంది. ఈ మేరకు కాకినాడ జేఎన్టీయూ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఏపీ ఈఏపీసెట్ పరీక్షలను కంప్యూటర్‌ ఆధారంగా నిర్వహించనున్నారు. పరీక్షకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విద్యా అర్హతలు, వయో పరిమితి, సిలబస్ మరియు దరఖాస్తు చేసుకునే విధానం ఇంకా ఇతర వివరాలకు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్సీహెచ్‌ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్‌/ఈఏపీసెట్‌’ను సందర్శించాలి.

కోర్సులు:

  • ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీటెక్‌అగ్రి ఇంజనీరింగ్, బీటెక్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • బీఎస్సీ(అగ్రి), బీఎస్సీ(హార్టికల్చర్‌), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/బీఎఫ్‌ఎస్సీ
  • బీఫార్మసీ, ఫార్మాడీ

దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్‌ రుసుము వివరాలు:

  • ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షకు.. ఓసీలకు రూ.600, బీసీలకు రూ.550, ఎస్సీ, ఎస్టీలకు రూ.500.
  • అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ పరీక్షకు, ఓసీలకు రూ.600, బీసీలకు రూ.550, ఎస్సీ, ఎస్టీలకు రూ.500.
  • రెండింటికీ కలిపి హాజరయ్యేవారికి రుసుము ఓసీలకు రూ.1,200, బీసీలకు రూ.1,100, ఎస్సీ, ఎస్టీలకు రూ.1,000.

దరఖాస్తు గడువు:

► ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 26 నుంచి జూలై 25 వరకు
► ఆలస్య రుసుము రూ.500తో ఆగస్టు 5 వరకు, రూ.1000తో ఆగస్టు 10 వరకు, రూ.5 వేలతో ఆగస్టు 16 వరకు, రూ.10 వేలతో ఆగస్టు 18 వరకు
► హాల్‌ టికెట్లను ఆగస్టు 12 నుంచి వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఆగస్టు 19 నుంచి పరీక్షలు ఇలా:

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు రెండు సెషన్లలో జరుగుతాయి.
► ఉదయం సెషన్‌ 9 నుంచి 12 గంటల వరకు
► మధ్యాహ్నం సెషన్‌ 3 నుంచి 6 గంటల వరకు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular