fbpx
HomeAndhra Pradeshసేవలు ప్రారంభించిన ఏపీ కొత్త రిజిస్ట్రేషన్ సర్వర్స్!

సేవలు ప్రారంభించిన ఏపీ కొత్త రిజిస్ట్రేషన్ సర్వర్స్!

ANDHRAPRADESH-NEW-REGISTRATION-SERVERS-STARTED-WORKING

అమరావతి: ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సర్వర్ల ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్లను చేయడం ఈ సోమవారం నుండి మొదలయ్యాయి. ఇంత వరకు ఆంధ్ర మరియు తెలంగాణకు కలిపి హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్‌ సర్వర్‌ వ్యవస్థను ఇప్పుడు పూర్తిగా విభజించారు. రెండు రోజుల క్రితం చేపట్టిన ఈ విభజన ప్రక్రియ ఆదివారంతో పూర్త్యైంది.

హైదరాబాద్ సిటీలో‌ నుంచి ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో ఉన్న పై–డేటా సెంటర్‌కి ఈ డేటాబేస్‌ను మార్చారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సర్వర్ల సామర్థ్యాన్ని ఇంతముందు కన్నా ఎక్కువ రెట్లు పెంచి డేటాబేస్‌ను సిద్ధం చేశారు. ఈ కొత్త సర్వర్లపైనే సోమవారం నూండి టెస్టింగ్‌ కింద రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లను చేశారు.

ఈ రోజు సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ టెస్టింగ్‌లో భాగంగానే చేసారు. అప్ డేట్ చేసిన సర్వర్‌లో తలెత్తే సమస్యలు మరియు ఇతరత్రా సాంకేతిక అంశాలన్నింటినీ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సర్వర్‌ వేగం‌ ఎలా ఉంది, ఎప్పుడు హెచ్చుతగ్గులకు లోనవుతోంది, వేలిముద్రల స్కానింగ్, వెబ్‌ల్యాండ్ మరియు స్టోరేజీ ఇంకా ఇతర అన్ని అంశాలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు.

ఈ ప్రక్రియ మొత్తం ముగియడానికి ఇంకో 48 గంటల వరకు సమయం పడుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ అండ్‌ కమిషనర్‌ ఎంవీ శేషగిరిబాబు తెలిపారు. బుధవారం నుంచి మార్చిన సర్వర్‌ వ్యవస్థ ద్వారా పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్లు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

ఇన్నాళ్ళు సెంట్రల్‌ సర్వర్‌ వ్యవస్థ తెలంగాణతో కలిసి ఉపయోగించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇరు రాష్ట్రాలకు కలిపి సర్వర్ల సామర్థ్యం సరిపోక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు తరచుగా సమస్యలు ఏర్పడుతుండేవి. ప్రజలు చాలా రోజుల తరబడి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన ఉదంతాలు చాలానే ఉన్నాయి.

ఈ సమస్యల వల్ల రాష్ట్రంలో ఆస్తుల రిజిస్ట్రేషన్లకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే సెంట్రల్‌ సర్వర్‌ వ్యవస్థను విభజించి ఆంధ్రప్రదేస్ లోనే నూతన డేటాబేస్ సర్వర్ ‌ను ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular