fbpx
HomeMovie Newsమరో ఆకట్టుకునే పాత్రలో పాయల్

మరో ఆకట్టుకునే పాత్రలో పాయల్

AnaganangaaOAthidi Teaser Released

టాలీవుడ్: RX100 సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయ్యి మొదటి సినిమా తోనే చాలా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఒక హీరోయిన్ గా మొదటి సినిమా అలాంటి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోరు.. కానీ అలాంటి పాత్ర చేసి మెప్పించింది ఈ హీరోయిన్. ఆ తర్వాత డిస్కో రాజా, వెంకీ మామ లాంటి పెద్ద సినిమాలు చేసినా కూడా అంత గుర్తింపు రాలేదు. ఇపుడు మళ్ళీ నటనకి ఆస్కారం ఉన్న మరో పాత్రతో రాబోతుంది పాయల్.

పాయల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘అనగనగా ఓ అతిధి’. ఈ సినిమా టీజర్ నిన్న విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. సినిమాలో పాయల్ పాత్ర చాలా విభిన్నంగా ఉంది. ఆమె లుక్స్ , యాక్టింగ్ కూడా ఆకట్టుకున్నాయి. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందించబడింది. పాయల్ తో పాటు చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలో ఈ సినిమా రూపొందించబడింది. చిన్న సినిమాలని ఎక్కువ స్ట్రీమ్ చేస్తున్న ‘ఆహా‘ ఓటీటీ ఈ సినిమాని కూడా నవంబర్ 20 నుండి వాల్ల ఓటీటీ లో అందుబాటులో ఉంచబోతుంది.

ఒక గ్రామంలో జరిగే రక రకాల హత్యలు, మూఢ నమ్మకాలని మూల కథగా చేసుకుని సినిమాని సిద్ధం చేసినట్టు అనిపిస్తుంది. అంతే కాకుండా విడుదల చేసిన టీజర్ లోని సన్నివేశాలని వారి వేషధారణని బట్టి చూస్తుంటే ఇందులో పాయల్ రెండు పాత్రల్లో నటించబోతుంది అని అనిపిస్తుంది. అమాయకపు పల్లెటూరి యువతి గ ఒక పాత్ర.. పూర్వ జన్మలో కోరికలు తీరక చనిపోయిన ఒక వేశ్య గ మరొక పాత్రలో నటించినట్టు అర్ధం అవుతుంది. ఈ సినిమా విజయవంతం అయితే మరించి మంచి పత్రాలు పాయల్ ని వరించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular