fbpx
HomeBig Storyసిద్ధమైన మోడెర్నా కోవిడ్ వ్యాక్సిన్ డేటా!

సిద్ధమైన మోడెర్నా కోవిడ్ వ్యాక్సిన్ డేటా!

MODERNA-VACCINE-FINAL-PHASE-DATA-READY

న్యూయార్క్‌: కరోనా వైరస్ కట్టడి కొసం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ తుది దశ క్లినికల్‌ పరీక్షల డేటాను విడుదల చేసేందుకు అమెరికన్‌ ఫార్మా దిగ్గజం మోడర్నా‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చివరి దశ క్లినికల్‌ పరీక్షలలో తమ వ్యాక్సిన్‌ 90 శాతంపైగా సత్ఫలితాలు ఇచ్చినట్లు యూఎస్‌ దిగ్గజం ఫైజర్‌ ఇంక్‌ పేర్కొంది.

ఇక రష్యా స్ఫుత్నిక్‌ పేరుతో విడుదల చేసిన వ్యాక్సిన్‌ అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) తెలియజేసింది. ఈ బాటలో తాజాగా మోడర్నా సైతం తుది దశ పరీక్షల డేటాను ప్రకటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

ఫైజర్‌ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ మైనస్‌ 70 డిగ్రీల సెల్షియస్‌లో నిల్వ ఉంచవలసి ఉన్నట్లు వెలువడిన వార్తలతో ఫార్మా రంగ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. దేశీయంగా ఈ వ్యాక్సిన్‌ నిల్వ, రవాణా, పంపిణీ వంటివి సమస్యాత్మకంగా తయరయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీంతో మోడర్నా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌కు ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు.

ఆఖరి దశ పరీక్షలకు సంబంధించిన తొలి మధ్యంతర విశ్లేషణ తమ వద్ద ఉన్నట్లు మోడర్నా చెబుతోంది. ఈ డేటా ద్వారా వ్యాక్సిన్‌ ఎంత సురక్షితమన్న అంశాన్ని తెలుసుకునే వీలున్నట్లు తెలియజేసింది. విశ్లేషణకు వీలుగా ఈ డేటాను స్వతంత్ర పర్యవేక్షక బోర్డుకి నివేదించనున్నట్లు వెల్లడించింది. తద్వారా వ్యాక్సిన్‌ పరీక్షల ఫలితాలను విశ్లేషించి సూచనలు చేయనున్నట్లు తెలియజేసింది.

ఐసీఎంఆర్‌ సహకారంతో రూపొందిస్తున్న కోవిడ్‌షీల్డ్‌ వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షల కోసం దేశీయంగా ఎన్‌రోల్‌మెంట్ పూర్తియినట్లు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. మరోవైపు నోవావ్యాక్స్‌, సీరమ్‌ అభివృద్ధి చేస్తున్న కోవావ్యాక్స్‌కూ ఐసీఎంఆర్‌ సేవలు అందిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular