fbpx
HomeMovie Newsఆసక్తికరంగా యేలేటి 'చెక్' టీజర్

ఆసక్తికరంగా యేలేటి ‘చెక్’ టీజర్

Nithin CheckMovie FirstGlimpseReleased

టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొత్తదనం కోసం ప్రయత్నించే డైరెక్టర్లు కొంతమందే ఉంటారు. అలాంటి వారిలో చంద్ర శేఖర్ యేలేటి ఒకరు. తన మొదటి సినిమా ‘ఐతే’ నుంచి ఆయన పద్ధతి అంతే. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఆయన ఎప్పుడూ కొత్తదనం కోసమే పరితపిస్తుంటారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ నితిన్ తో కలిసి ‘చెక్’ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన టీజర్ విడుదలైంది. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. నితిన్ ని ఈ సినిమాలో ఒక ఖైదీ లాగా చూపిస్తున్నారు.

జైలు లో ఉన్న ఒక ఖైదీ ఒక సూపర్ చెస్ ప్లేయర్ అయి ఉంటాడు. టీజర్ లో చూపించిన సీన్స్ ప్రకారం అమాయకుడు అయిన హీరో ఒక కేసు లో ఇరుక్కుని తీవ్రవాది అనే ముద్ర పడి ఉరి శిక్ష పడి జైలు లో గడుపుతుంటాడు. మరి చెస్ కి జైలు నుండి బయటపడటానికి ఎలాంటి సంబంధం ఉంది అనేది సినిమా కథనం అన్నట్టు తెలుస్తుంది.

నితిన్ కూడా ఇప్పటి వరకు పెద్దగా కొత్త ప్రయత్నాలు చేసింది ఏమీ లేదు. ఫామిలీ సినిమాలు, లవ్ స్టోరీ లు ఎక్కువ చేసే నితిన్ ఈ సినిమా ద్వారా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు నితిన్ ప్రస్తుతం రంగ్ దే మరియు అందాదున్ రీమేక్ చేస్తున్నాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ మరియు వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular