fbpx
Thursday, April 18, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeMovie Newsధనుష్ హీరోగా 'యుగానికి ఒక్కడు 2 '

ధనుష్ హీరోగా ‘యుగానికి ఒక్కడు 2 ‘

YuguanikiOkkadu SequelAnnouncment WithDhanush

కోలీవుడ్: తమిళ నటుడు కార్తీ హీరోగా , విలక్షణ దర్శకుడు ‘సెల్వ రాఘవన్‘ దర్శకత్వం లో 2010 సంవత్సరం లో విడుదలైన సినిమా ‘ఆయిరథి ఒరువన్’ , తెలుగు లో ‘యుగానికి ఒక్కడు’ పేరుతో డబ్ చేసి విడుదల చేసారు. సినిమా విడుదల అయినపుడు మిక్స్డ్ టాక్ తో పరవాలేదని పించింది. కానీ తర్వాత ఈ సినిమా గురించి చాలా మంది పొగిడారు. ఇదొక కల్ట్ సినిమాగా కూడా అభివర్ణిస్తారు. ఒక డిఫరెంట్ ప్లాట్ తో రూపొందిన ఈ సినిమా ముఖ్యంగా మిగతా ఫిలిం మేకర్స్ ని విపరీతం గా ఆకట్టుకుంది. ఏ రకంగా చూసినా కూడా ఈ సినిమా మిగతా సినిమాల లాగా కాకుండా ఎక్కడ కూడా రొటీన్ ప్లాట్ కనిపించదు.

అలాంటి సినిమాకి ఇపుడు సీక్వెల్ ప్రకటించాడు డైరెక్టర్. ఈ రెండవ భాగం లో కార్తీ ని కాకుండా తన సోదరుడు ధనూష్ ని హీరోగా ఎంచుకున్నాడు. ఈ సినిమాని 2024 కి టార్గెట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ధనూష్ ట్వీట్ చేస్తూ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కే సంవత్సరం పడుతుంది కానీ ఇలాంటి సినిమా కోసం అన్ని సంవత్సరాలు కష్టపడొచ్చు అని ట్వీట్ లో తెలియచేసారు. ధనుష్ ప్రస్తుతం చేసున్న సినిమాల లైనప్ కూడా పెద్దగా ఉండడం తో ఈ సినిమా పూర్తి అవడానికి కూడా అదే సమయం పడుతుంది. ధనుష్ ట్వీట్ చేస్తూ ప్రిన్స్ 2024 లో వస్తాడు అని తెలిపాడు.. దీని ప్రకారం ఈ రెండవ పార్ట్ మొదటి పార్ట్ ముగిసినప్పటినుండి కాకుండా మరొక కొత్త కథ అనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular