టాలీవుడ్: ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాలుగా కష్ట పడుతూ చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ హీరో స్థాయికి ఎదిగాడు సత్యదేవ్. ఈ లాక్ డౌన్ లో విడుదలైన ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ సినిమా ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుని ఇపుడు వరుస సినిమాలని లైన్ లో పెడుతూ ఫుల్ బిజీ అయ్యాడు ఈ లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్. కేవలం లుక్స్ మాత్రమే కాకుండా నటన పరంగా కూడా మంచి మార్కులు కొడుతున్న ఈ హీరో ప్రతీ సినిమాకి కథ లో నటనలో కొత్తదనం చూపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. హీరో గా వచ్చిన కొద్దీ కాలం లోనే తన నటన తోనే ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకున్నాడు. మెగా స్టార్ చిరంజీవి దగ్గరి నుండి కూడా ప్రశంసలు పొందాడు.
ప్రస్తుతం ఈ హీరో ‘గాడ్సే’ అనే టైటిల్ తో ఒక సినిమా ప్రకటించాడు. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసాడు. సత్యదేవ్ ఇదివరకే ‘బ్లఫ్ మాస్టర్’ అనే ఒక సినిమా చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో సత్యదేవ్ నటనకి మరియు గోపి గణేష్ పట్టాభి డైరెక్షన్ కి మెగా స్టార్ ప్రశంసలు పొందారు. ఇప్పుడు వీళ్లిద్దరు ఈ సినిమా ద్వారా మరోసారి కలిసి పని చెయ్యబోతున్నారు. ఫస్ట్ లుక్ లో సత్యదేవ్ గన్ పట్టుకుని యాంగ్రీ లుక్ లో ఉన్నాడు. ఈ సినిమాని సి కే స్క్రీన్స్ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.