fbpx
HomeInternationalయోషిహిడే సుగా: జపాన్‌ నూతన ప్రధానిగా ప్రకటన

యోషిహిడే సుగా: జపాన్‌ నూతన ప్రధానిగా ప్రకటన

YOSHIHIDE-SUGA-NEW-PRIMEMINISTER-JAPAN

టోక్యో: జపాన్ ప్రధాని అయిన షింజో అబే ఈటీవలే తన అనారోగ్య కారణాల వల్ల ప్రధాని పదవి కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఆయన రాజీనామా ప్రకటన చేసినప్పటి నుండి జపాన్ తదుపరి ప్రధాని ఎవరు అన్నది యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న విషయం అనే చెప్పవచ్చు. ఇన్నాళ్ళకు ఆ ఉత్కంఠకు తెర పడింది. జపాన్ తదుపరి ప్రధాని ని ప్రకటించింది లిబరల్ డెమొక్రటిక్ పార్టీ.

జపాన్‌ లో అధికార పార్టీ లిబరల్ డెమొక్రటిక్ పార్టీ కి నూతన సారథిగా యోషిహిడే సుగా ఎంపికయ్యారు. అధికార లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీలో అంతర్గతంగా జరిగిన ఎన్నికల్లో 377 ఓట్లు సాధించిన సుగాను కాబోయే జపాన్‌ ప్రధానమంత్రిగా ప్రకటించారు. అనారోగ్య కారణాలతో ఇటీవలే రాజీనామా చేసిన షింజో అబే స్థానంలో ఈయన ఎంపికయ్యారు.

సుగా ప్రస్తుతం చీఫ్‌ కేబినెట్‌ సెక్రటరీగా అబేకి కుడిభుజంగా ఉన్నారు. ఈయన పార్లమెంటుకి ఎంపిక కావడం లాంఛనమే. కరోనా కట్టడి, పతనమైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడం తన తక్షణ ప్రాధమ్యాలని సుగా పేర్కొన్నారు. తాను సంస్కరణ వాదినన్నారు. మాజీ ప్రధాని అబే ప్రాధమ్యాలను ఈయనా కొనసాగిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular