fbpx
Friday, May 3, 2024
HomeMovie News'నో ఎంట్రీ' అంటున్న ఆండ్రియా

‘నో ఎంట్రీ’ అంటున్న ఆండ్రియా

Andreajeremiah LatestMovie NoEntryFirstLook

కోలీవుడ్: ‘నో ఎంట్రీ’ అనే కొత్త రకమైన థ్రిల్లర్ సినిమాతో రాబోతోంది ఆండ్రియా జెరెమియా. జంబో క్రియేషన్స్ బ్యానర్ పై ఏ. శ్రీధర్ అనే నిర్మాత ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అళగు కార్తీక్ అనే దర్శకుడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవబోతున్నాడు. న్యూ ఏజ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ మూవీ ఉండబోతుంది అని ఒక ఫస్ట్ లుక్ విడుదల చేసారు సినిమా టీం. టైటిల్ ని ఫస్ట్ లుక్ ని బట్టి చూస్తుంటే ప్రవేశం లేని ఒక అడవిలోకి ఆండ్రియా ఎదో శోధన లో వెళ్లడం అక్కడ జరిగే పరిస్థితులు కథాంశంగా కనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్లడానికి దారి తీసిన పరిస్థితులు తన అన్వేషణ లోనే దర్శకుడి కథనం ఎలా ఉందొ తెలుస్తుంది.

డైరెక్ట్ తెలుగు లో తడాఖా అనే ఒకే సినిమా చేసినప్పటికీ ఆండ్రియా తెలుగు లో పెద్దగా ఫేమస్ అవలేదు. కానీ తమిళ్ లో చాలా సినిమాలు చేసి మంచి నటి గా పేరు సంపాదించింది. మొదట సింగర్ గా తన ప్రయాణం ప్రారంభించి కార్తీ నటించిన ‘యుగానికి ఒక్కడు’ సినిమా ద్వారా మంచి పేరు సంపాదించింది. అప్పటినుండి హీరోయిన్ గా చాలానే సినిమాలు చేసింది. తాను నటించిన ‘అరన్మణి’, ‘గృహం’ లాంటి థ్రిల్లర్ సినిమాలు తెలుగు లో డబ్ అయ్యి కూడా పరవాలేదు అనిపించుకున్నాయి. ఈ మధ్య ఆండ్రియా తాను చేసే రోల్స్ కొంచెం సెలెక్టివ్ గా ఉండి ఆకట్టుకుంటున్నాయి. వెట్రిమారన్, ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన ‘వడ చెన్నై’ లో ఒక స్పెషల్ రోల్ లో నటించి అందరి ప్రశంసలు పొందింది. ఆ ఊపు లోనే సోలో గా ఇపుడు ఈ థ్రిల్లర్ ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఈ హీరోయిన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular