fbpx
HomeMovie Newsపవన్ పై తనదైన శైలిలో స్పందించిన హరీష్ శంకర్

పవన్ పై తనదైన శైలిలో స్పందించిన హరీష్ శంకర్

HareeshShankar ResponceOn PawanKalyanPolitics

టాలీవుడ్: గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నట్టు తెలిసిన విషయమే. మొన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమాకి సంబందించిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేసారు సినిమా టీం. అదే రోజు ఒక మీడియా ఛానల్ కి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు హరీష్ శంకర్. సినిమా ప్రశ్నలతో పాటు ఆ ఇంటర్వ్యూ లో పవన్ పొలిటికల్ ఎంట్రీ పై వచ్చిన ప్రశ్నలకి తనదైన శైలి లో స్పందించాడు ఈ డైరెక్టర్.

‘పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయారని.. దీనిపై మీ అభిప్రాయం ఏంటని’ హరీష్ శంకర్ ను ప్రశ్నించాడు రిపోర్టర్. దీనికి హరీష్ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు. ‘మీరు వృథాప్రయాస చేస్తున్నారు. సినిమా దర్శకుడిని సినిమాల గురించి అడగాలి.. రాజకీయాల గురించి కాదు.. నేనేమైనా మీ చానెల్ ఎండీనా? మీ భాష ఏంటి? నేనే విశ్లేషణ చేయడం ఏంటి’ అంటూ సదురు రిపోర్టర్ ను కడిగిపాడేశాడు. అయినా కూడా మళ్ళీ పవన్ రాజకీయ జీవితంపై ప్రశ్నలు అడిగిన రిపోర్టర్ ఏంటి ఈ వృథా ప్రయాస అంటూ రెస్పాన్స్ ఇచ్చారు. డైరెక్టర్ గా తెరపైన కాకుండా తెర వెనక కూడా హరీష్ శంకర్ మాటల్తో కుమ్మేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular