fbpx
HomeTop Movie Newsబిగ్ బాస్ తెలుగు 6 హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ?

బిగ్ బాస్ తెలుగు 6 హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ?

BALAKRISHNA-HOST-OF-BIGGBOSS6-IN-STARMAA-RUMOURS-ONLINE

హైదరాబాద్: తెలుగు లో బిగ్‌బాస్‌ 5 గ్రాండ్‌ ఫినాలే రోజే తరువాతి సీజన్‌ గురించి హింటిచ్చేశాడు కింగ్ నాగార్జున. ఈ సీజన్ అయిన రెండు నెలల్లోనే తరువాతి సీజన్‌ మొదలవబోతుందని ప్రకటించాడు. అయితే మొదలయ్యేది ఆరవ సీజనా? లేక బిగ్‌బాస్‌ ఓటీటీ మొదటి సీజనా? అనేది ఇంకా క్లారిటీ లేదు. సోషల్‌ మీడియాలో మాత్రం అది ఓటీటీ సీజన్‌ అయ్యుంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇదే నేపథ్యంలో రాబోయే సీజన్ కి హోస్ట్ ఎవరని అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా తెలుగు లో బిగ్‌బాస్‌ తొలి సీజన్‌కు ఎన్టీఆర్‌, రెండో సీజన్‌కు నాని, మూడు, నాలుగు, ఐదో సీజన్లకు వరుసగా నాగార్జున యాంఖర్ గా వ్యవహరించారు. అయితే తరువాతి సీజన్‌కు మాత్రం నాగ్‌ను తప్పించి మరో స్టార్‌ హీరోను రంగంలోకి దింపుతున్నారట!

అయితే ఈ సారి స్టార్‌ హీరో ఇంకెవరో కాదు నందమూరి వారసుడు బాలకృష్ణ. ఆహాలో అన్‌స్టాపబుల్‌ షోలో హోస్ట్‌గా అలరిస్తున్నాడు బాలయ్య. దీంతో ఈ రియాలిటీ షోను బాలయ్యకు అప్పగిస్తే హోస్టింగ్‌, ఎంటర్‌టైనింగ్‌ వేరే లెవల్‌ ఉంటుందని అంటున్నారు నెటిజన్లు. కానీ నాగార్జునను కాదని బాలయ్యను వ్యాఖ్యాతగా తీసుకువచ్చే ఛాన్సే లేదన్న అభిప్రాయం కూడా ఒక వైపు ఉంది.

ఒకవేళ నాగార్జున షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండి బిగ్‌బాస్‌ బాధ్యతను తీసుకోకపోతే తదుపరి ఆప్షన్ గా బాలయ్యను రంగంలోకి దింపే అవకాశం లేకపోలేదు. బాలయ్య వస్తే మాత్రం షో తీరుతెన్నులే మారిపోవడం ఖాయం అన్ అందరి అభిప్రాయం! మరి రెండు నెలల్లో ప్రారంభమయ్యే బిగ్‌బాస్‌ షో హోస్ట్‌ ఎవరన్నదానికి కాలమే సమాధానం చెబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular