fbpx
Wednesday, April 24, 2024
HomeTelanganaతెలంగాణ లో ఒక్క సారిగా పెరిగిన ఒమిక్రాన్ కేసులు!

తెలంగాణ లో ఒక్క సారిగా పెరిగిన ఒమిక్రాన్ కేసులు!

TELANGANA-REGISTERS-14-OMICRON-CASES-TODAY

హైదరాబాద్: తెలంగాణ లో ఒక్క సారిగా ఒమిక్రాన్ కేసులు పెరిగాయి. ఈ రోజు ఒక్కటే రాష్ట్రంలో 14 ఒమిక్రాన్ కేసులు నమోదవడం తీవ్ర కలకలం రేపుతోంది. కాగా ఈ 14 కేసులన్నీ విదేశాల నుండి వచ్చిన వారివే కావడం గమనార్హం.

తాజా ఈ 14 కేసులతో కలిపి ఇప్పుడు తెలంగాణ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38 కి చేరుకుంది. కాగా పాజిటివ్ గా పరీక్షించబడిన వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను ట్రేస్ చేసి వారికి కూడా టెస్టులు చేస్తున్నారు అధికారులు.

ఇదిలా ఉండగా ఈ నెల 18న ఆ ఆరుగురికీ ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా సోకినట్లు నిర్ధారణ అవడంతో వారు ఇచ్చిన చిరునామాలకు అధికారులు వెళ్లగా అక్కడ వారికి ఎటువంటి ఆచూకీ లభించలేదు. ఎట్టకేలకు ఎలాగోలా నలుగురిని మంగళవారం రాత్రి గుర్తించి ఆస్పత్రులకు తరలించారు. మిగిలిన ఇద్దరి కోసం అధికారులు వెతుకుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular