fbpx
HomeTop Movie Newsఆహాలో పరిచయం అవబోతున్న తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షో!

ఆహాలో పరిచయం అవబోతున్న తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షో!

AHA-LAUNCHES-INDIANIDOL-SHOW-IN-TELUGU-FOR-FIRSTTIME

హైదరాబాద్: ఆహా – మొట్టమొదటి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం. ఆహా ఎల్లప్పుడూ ప్రేక్షకులకు నూతన విధానం లో వినోదం పంచే దిశగా అడుగులు వేస్తుంది. దాని వల్లే ప్రారంభమైన తక్కువ కాలంలోనే రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఎప్పటికప్పుడు కంటెంట్‌ను అందిస్తోంది తెలుగు ఓటీటీ ఆహా.

ఇటీవలే నూతనంగా ఆహా అగ్ర హీరో నందమూరి బాలకృష్ణతో ‘అన్‌స్టాబుల్‌ విత్‌ బాలయ్య’ అనే పేరుతో ఒక కొత్త టాక్‌ షో నిర్వహిస్తోంది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఆహా మరో కొత్త సంచలనానికి తెర తీసింది. ఆహా త్వరలోనే తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షోను పరిచయం చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది.

కాగా మన దేశంలో ఇప్పటి దాకా ఇండియన్‌ ఐడల్‌ షోస్ అన్నీ హిందీలో జరిగే సింగింగ్‌ రియాలిటీ షో అని మాత్రమే మనకు తెలుసు. ఇప్పటికే హీందీలో 12 సీజన్లు కంప్లీట్‌ చేసుకున్నప్పటికీ ఇంతవరకు ఈ షో ఒక్క సారి కూడా తెలుగులో చేయలేదు. దీంతో ఇండియన్‌ ఐడల్‌ తెలుగులో పరిచయం చేసేందుకు ఆహా సన్నాహాలు చేస్తోంది.

ఈ విషయంలో ఆహా అధికారిక ప్రకటన కూడా చేసింది. తెలుగు సింగింగ్‌ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతోనే ఆహా ఈ సరికొత్త రియాలిటీ షోను ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తాజాగా ఆడిషన్స్‌కు సంబంధించిన వివరాలను కూడా ప్రకటించారు ఆహా నిర్వహకులు.

కాగా ఈ షోను డిసెంబర్‌ 26వ తేదీన తొలి ఆడిషన్స్‌ నిర్వహించబోతున్నారు. దీనికోసం 14 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న గాయనీ గాయకులకు ఆహ్వానం అందించింది ఆహా. ఈ ఆడిషన్స్‌ హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని ఒయాసిస్‌ స్కూల్‌లో నిర్వహించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular