fbpx
Friday, March 29, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeMovie Newsఓటీటీ లో మరో తమిళ సినిమా

ఓటీటీ లో మరో తమిళ సినిమా

Another TamilMovie OTTRelease

టాలీవుడ్: సెకండ్ వేవ్ ముగిసి థియేటర్లు తెరచుకుంటున్నా కూడా ఓటీటీ రిలీజ్ లు ఏ మాత్రం తగ్గడం లేదు. తెలుగు తమిళ్ లో పెద్ద హీరో ల సినిమాలు కూడా ఓటీటీ రిలీజ్ ల బాట పడుతున్నాయి. ఓటీటీ ల కోసమే సెపెరేట్ కంటెంట్ సిద్ధం అవుతున్నాయి. తమిళ్ లో ఈ మధ్యనే ఆర్య నటించిన ‘సార్పట్ట’ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు లో కూడా ఈ సినిమాని చాలా ఆదరించారు. ఇపుడు మరో తమిళ సినిమా ఓటీటీ విడుదలకి రంగం సిద్ధం అయింది.

విజయ్ సేతుపతి, తాప్సి పన్ను నటించిన ‘అనాబెల్లె సేతుపతి’ అనే సినిమా ఓటీటీ లో విడుదల అవనున్నట్టు ఈ రోజు ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఇందులో విజయ్ సేతుపతి మరియు తాప్సి తెల్లని దుస్తుల్లో కొత్త రకమైన మేక్ అప్ తో ఉన్నారు. ఇది ఒక హర్రర్ సినిమా కానీ కొత్తరకంగా ఉండనున్నట్టు పోస్టర్ ద్వారా అనిపిస్తుంది.

ఈ సినిమాని ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై సుధాన్ సుందరం, జి జయరాం నిర్మిస్తున్నారు. దీపక్ సుందర్ రాజన్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాని సెప్టెంబర్ 17 నుండి డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ లో స్ట్రీమ్ చేయనున్నారు. ఈ సినిమాతో పాటు సెప్టెంబర్ 9 న ‘లాభం’ అనే సినిమాని కూడా విడుదల చేస్తున్నాడు విజయ్ సేతుపతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular