మూవీడెస్క్: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ ‘క’ ట్రైలర్ విడుదలైంది.
ఇప్పటికే పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కిరణ్, ఈసారి మరింత డిఫరెంట్ రోల్ లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
సుజీత్, సందీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది.
దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయబోతున్న ఈ మూవీ, ట్రైలర్ ద్వారా అంచనాలను మరింత పెంచింది.
కథలో కృష్ణ గిరి గ్రామం కీలకం. కిరణ్ అబ్బవరం పోస్ట్ మ్యాన్ వాసుదేవ్ గా కనిపిస్తారు.
అతని జీవితాన్ని మార్చేసే ఒక లెటర్, సస్పెన్స్ తో కూడిన కథలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
లెటర్ వెనుక ఉన్న రహస్యం, వాసుదేవ్ ను బెదిరిస్తున్న గ్యాంగ్ అంతా ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపింది.
ఈ ట్రైలర్ ఇప్పుడే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
కిరణ్ అబ్బవరం యాక్షన్ సన్నివేశాల్లో తన యాక్టింగ్ టాలెంట్ ని చాటుకున్నారు.
సామ్ సీఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విజువల్స్ ని మరింత రిచ్ గా మార్చింది. దర్శక ద్వయం సుజీత్, సందీప్ ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.
ట్రైలర్ లో సస్పెన్స్, థ్రిల్ కలగలిపి, ఫుల్ ఎంటర్ టైన్ చేసేలా ఉన్నట్లు ఆడియన్స్ స్పందిస్తున్నారు.
‘క’ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
డిసెంబర్ 5న థియేటర్లలో మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.