fbpx
HomeMovie Newsఓటీటీ లో ఈ వారం !

ఓటీటీ లో ఈ వారం !

OTTContent Releasing ThisWeek

టాలీవుడ్: థియేటర్ లు తెరచుకోకపోవడం తో ఓటీటీ లో వచ్చే సినిమాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. థియేట్రికల్ రిలీజ్ కోసం సిద్ధం చేసిన సినిమాలు మాత్రమే కాకుండా ఓటీటీ కోసం స్పెషల్ గా సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈవారం ఓటీటీల్లో విడుదలయ్యే కంటెంట్ చూద్దాం.

తెలుగు లో ‘కుడి ఎడమైతే’ అనే ఒక వెబ్ సిరీస్ ఈ రోజు విడుదలవుతుంది. అమలాపాల్ మరియు రాహుల్ విజయ్ ఈ సిరీస్ లో ముఖ్య పాత్రల్లో నటించారు. ‘లూసియా’, ‘యూ టర్న్’ సినిమాలు రూపొందించిన పవన్ కుమార్ ఈ సిరీస్ ని డైరెక్ట్ చేసారు. టైం లూప్ నేపథ్యం లో టిపికల్ స్క్రీన్ ప్లే తో ఈ సిరీస్ రూపొందించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. పవన్ ఇదివరకు రూపొందించిన రెండు సినిమాల్లో కూడా దాదాపు అదే ఫాలో అయ్యాడు. ఈ సిరీస్ తో కూడా అలాంటి కాన్సెప్ట్ తోనే సినీ ప్రేక్షకులని సర్ప్రైస్ చేయనున్నాడని తెలుస్తుంది. ఆహా ఓటీటీ లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

హిందీ లో ఫర్హాన్ అక్తర్ హీరోగా రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం లో ‘తూఫాన్’ అనే స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా రూపొంది ఈ రోజు విడుదలైంది. భాగ్ మిల్కా భాగ్ కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందడం తో అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఒక వీధి రౌడీ గా ఉండే వ్యక్తి నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కి ఎలా ఎదిగాడు అనే ఎమోషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ కంటెంట్ తో సినిమా రూపొందినట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో ఈ రోజు నుండి ఈ సినిమా అందుబాటులో ఉంది.

మలయాళం లో ఫాహద్ నటించిన ‘మాలిక్’ అనే మూవీ నిన్నటి నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో అందుబాటులో ఉంది. తన ఏరియా లో ఉండే ఒక వర్గం ప్రజల కోసం పోరాడే వ్యక్తి పాత్రలో ఫాహద్ ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో ఫాహద్ నటనకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

తమిళ్ లో అదితి బాలన్ ప్రధాన పాత్రలో ‘అరువి’ అనే సినిమాని రూపొందించి ఎంతో మంచి ప్రశంసలు పొందిన డైరెక్టర్ అరుణ్ ప్రభు పురుషోత్తమన్. ఈ డైరెక్టర్ తన రెండవ ప్రయత్నం గా ‘వాఙల్’ అనే సినిమాని రూపొందించాడు. ఇన్నర్ పీస్ కోసం చూసే ఒక ఎమోషనల్ అండ్ మోటివేషనల్ మూవీ గా ఈ సినిమా రూపొందింది. ట్రైలర్ కట్ కూడా ఇంటరెస్టింగ్ గా ఉన్న ఈ సినిమాని సోనీ లైవ్ ఓటీటీ ద్వారా ఈరోజు విడుదల చేసారు.

ఈ రోజు విడుదలైన ఈ నాలుగు ఓటీటీ కంటెంట్ మంచి ఆదరణ తో ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రతీ కంటెంట్ వేరు వేరు భాషల్లో పైగా వేరే వేరే జానర్స్ తో ఉన్న కంటెంట్ కావడం తో ఎక్కువ భాషల్ని ఆదరించే వారికి ఈ వారం ఈ కంటెంట్ తో మంచి ఎంటర్టైన్మెంట్ లభిస్తుందని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular