fbpx
HomeAndhra Pradeshరూ.10,350.21 కోట్ల పెట్టుబడులు ఏపీలో!

రూ.10,350.21 కోట్ల పెట్టుబడులు ఏపీలో!

10350-CRORES-INVESTMENT-IN-AP

అమరావతి: ఏపీలో పలు ప్రాంతాల్లో రూ.10,350.21 కోట్ల పెట్టుబడులతో ఐదు భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అనుమతిలను ఇస్స్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భారీ ఐదు ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో ప్రత్యక్షంగా 12,454 మందికి ఉపాధి లభిస్తాయని అంచనా.

ఈ ప్రాజెక్ట్ల వివరాలు: నెల్లూరు జిల్లాలో జిందాల్‌ స్టీల్, నాయుడుపేట సెజ్‌లో గ్రీన్‌టెక్ కంపెనీ యొక్క‌ విస్తరణ, గుంటూరు జిల్లా తాడేపల్లిలో క్యాపిటల్‌ బిజినెస్‌ పార్క్‌ నిర్మించే టెక్స్‌టైల్‌ పార్క్, చిత్తూరు జిల్లాలో అమ్మయప్పర్‌ గార్మెంట్స్‌ వారి తయారీ యూనిట్, విశాఖలో సెయింట్‌ గోబెయిన్‌ ప్రాజెక్టులకు అనుమతులు మరియు వాటికి అవసరమైన ప్రత్యేక రాయితీలను ఇస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.కరికల్‌ వలవన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

గత నెల జూన్‌ 29న సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట ఏపీ సెజ్‌లోని ఆటో కాంపోనెంట్స్‌ తయారీ సంస్థ గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ విస్తరణ ప్రాజెక్టును చేపట్టింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు స్టీల్‌ కాస్టింగ్‌ రంగంలోకి అడుగు పెడుతోంది.

చిత్తూరు జిల్లా నిండ్ర మండలం ఎలకట్టూర్‌లో రూ.29.05 కోట్లతో డెనిమ్‌ మెన్స్, కిడ్స్‌ గార్మెంట్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు అమ్మయప్పర్‌ టెక్స్‌టైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ముందుకు వచ్చింది. ఈ టెక్స్టైల్స్ యూనిట్‌ ద్వారా 2,304 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించబోతోంది.

ఇంకా విశాఖ సమీంపలోని అచ్యుతాపురం సెజ్‌లో సెయింట్‌ గోబెయిన్‌ సంస్థ రూ.2,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న జిప్సం ప్లాస్టర్‌ బోర్డ్, ఫోట్‌ గ్లాస్‌ తయారీ యూనిట్‌ పనుల కాలపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్, లాక్‌డౌన్‌ కారణంగా తొలి దశ పనులు ఆలస్యం కావడంతో కాలపరిమితి పొడిగించాలన్న విజ్ఞప్తిని ప్రభుత్వం ఆమోదించింది.

జిందాల్‌ స్టీల్‌ అండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (జేఎస్‌పీఎల్‌) నెల్లూరు జిల్లాలో రూ.7,500 కోట్లతో టీఎం టీ బార్స్, వైర్‌ రాడ్స్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దీంతో వచ్చే నాలుగేళ్లలో ప్రత్యక్షంగా 2,500 మందికి, పరోక్షంగా 15, 000 మందికి ఉపాధి లభించనుంది. జిందాల్‌ గ్రూపు ఇందుకోసం జిందాల్‌ స్టీల్‌ ఆంధ్రా లిమిటెడ్‌ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసింది.

గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద రూ.194.16 కోట్లతో అప్పారెల్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధికి క్యాపిటల్‌ బిజినెస్‌ పార్క్‌ ఎల్‌ఎల్‌పీ ముందుకొచ్చింది. సుమారు 900 టెక్స్‌టైల్‌ షాపులు ఏర్పాటు చేసే విధంగా 7 లక్షల చదరపు అడుగుల్లో ఈ పార్క్‌ను అభివృద్ధి చేయనున్నారు. దీనిద్వారా ప్రత్యక్షంగా 5,000 మందికి ఉపాధి లభించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular