fbpx
HomeMovie News'కుడి ఎడమైతే' ట్రైలర్

‘కుడి ఎడమైతే’ ట్రైలర్

KudiYedamaite Trailer Release

టాలీవుడ్: పూర్తి తెలుగు కంటెంట్ తో దూసుకుపోతున్న ఆహా వారు ‘కుడి ఎడమైతే‘ అనే వెబ్ సిరీస్ ని రూపొందించారు. ‘లూసియా’, ‘యూ టర్న్’ లాంటి సినిమాలని రూపొందించిన పవన్ కుమార్ ఈ సిరీస్ ని డైరెక్ట్ చేసారు. ఈ సిరీస్ ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ఈ సిరీస్ లో ఒక ఇన్స్పెక్టర్ పాత్రలో అమలా పాల్ మరియు ఒక కొరియర్ బాయ్ గా పని చేస్తూ సినిమా ప్రయత్నాలు చేసే పాత్రలో రాహుల్ విజయ్ నటిస్తున్నాడు.

ఫిబ్రవరి 29 , 4 సంవత్సరాలకి వచ్చే ఒకే రోజు – ఈ రోజు జరిగే ఒక సంఘటన ఆధారంగా ఈ సిరీస్ ని రూపొందించారు. ట్రైలర్ లో ఒకేలా ఉండే ఇన్సిడెంట్స్ ని ఫేస్ చేయడం అమల పాల్ మరియు రాహుల్ విజయ్ లైఫ్ లో జరిగిన సీన్స్ ని చూపించి వాళ్ళిద్దరికీ జరిగే ఆక్సిడెంట్ ని చూపిస్తారు. ఒక సారి రాహుల్ విజయ్ గాయ పడగా మరోసారి అమలా పాల్ గాయపడడం చూపిస్తారు. మరోసారి వీళ్లిద్దరు ఒక గది లో జరిగిన ఆక్సిడెంట్ గురించి మాట్లాడుకోవడం చూపిస్తారు. మధ్యలో ఒక చిన్న పిల్లాడి కిడ్నాప్ కి సంబందించిన సీన్స్ చూపించారు. ఓవరాల్ గా టైం ట్రావెల్ సినిమానా అనే డౌట్ క్రియేట్ చేయగలిగాడు డైరెక్టర్.

ట్రైలర్ చూసిన తర్వాత రెగ్యులర్ థ్రిల్లర్ కాకుండా సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంది ట్రైలర్. వరుసగా ఓటీటీ కంటెంట్ తో దూసుకెళ్తున్న ఆహా వారు ఈ సిరీస్ తో మరో మంచి కంటెంట్ ని అందించనున్నారు. ఆహ ఓటీటీ లో జులై 16 నుండి ఈ సిరీస్ అందుబాటులో ఉండనుంది.

https://www.youtube.com/watch?v=c8zEzx1h4oQ&ab_channel=ahavideoIN

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular