fbpx
Sunday, April 28, 2024
HomeMovie Newsవిజయ్ సేతుపతి 'విడుతలై' ఫస్ట్ లుక్

విజయ్ సేతుపతి ‘విడుతలై’ ఫస్ట్ లుక్

VijaySethupathi ViduthalaiMovie FirstLook

కోలీవుడ్: తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇపుడు యూనివర్సల్ స్టార్ అయ్యాడు. ఆయన సినిమాలకి సంబందించిన అప్ డేట్స్ అందరూ ఫాలో ఐతున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి మూడు నాలుగు సినిమాల్లో ఒకేసారి నటిస్తున్నాడు. అందులో ఒకటి ‘విడుతలై’. నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీస్ ‘ఆడుకులం’, ‘అసురణ్’ అలాగే ‘వడ చెన్నై’,’విసరణైః’ లాంటి సినిమాలని రూపొందించిన డైరెక్టర్ వెట్రి మారన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.

ఈ సినిమాతో ఒక నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ మరో నేషనల్ అవార్డు విన్నింగ్ నటుడితో కలిసి పని చేయనున్నాడు. ఈ రోజు ఈ సినిమా నుండి రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేసింది సినిమా టీం. ఇందులో ఒక పోస్టర్ లో జైల్లో సంకెళ్లు కట్టుకుని ఖైదీ మాదిరిగా విజయ్ సేతుపతి కనిపించాడు. మరో పాత్రలో కమెడియన్ సూరి, చేతిలో గన్ పట్టుకుని పోలీస్ యూనిఫామ్ వేసుకుని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఆర్.ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ పై ఎల్డ్రెడ్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని తమిళ్, తెలుగు మరియు మరిన్ని భాషల్లో ఒకే సారిపాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular