fbpx
HomeMovie Newsటాలీవుడ్ వైపు చూస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్

టాలీవుడ్ వైపు చూస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్

Bollywood Heroins MoviesInTollywood

టాలీవుడ్: కొన్ని సంవత్సరాల క్రితం మోడల్ గా ఉన్న అప్ కమింగ్ హీరోయిన్లు టాలీవుడ్ ని ఇనీషియల్ బూస్టింగ్ కోసం వాడుకునేవారు. ఇక్కడ ఒకటి రెండు సినిమాలు తీసి కొంత పేరు రాగానే బాలీవుడ్ లో ఆఫర్లు వస్తే అటు వెళ్తుంటారు. కానీ ఇపుడు పరిస్థితి మారిపోయింది. కోర్ బాలీవుడ్ హీరోయిన్స్- అంటే మొదటి నుండి బాలీవుడ్ లోనే సినిమాలు తీసిన టాప్ హీరోయిన్స్ కూడా టాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. మున్ముందు రాబోతున్న సినిమాలు చూస్తే ఈ విషయం స్పష్టం గా తెలుస్తుంది.

బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న ఆలియా భట్ ‘RRR ‘ సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టనుంది. ఈ సినిమా సక్సెస్ తర్వాత మరిన్ని సినిమాలు ఒప్పుకునే అవకాశం ఉంది. మరో సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రభాస్ , నాగ్ అశ్విన్ సినిమాలో నటించనుంది. తెలుగు లో మొదటి సినిమా తీసిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ కూడా ప్రభాస్ తో తియ్యబోయే సినిమాతో మరో సారి తెలుగు అభిమానులని పలకరించనుంది. మరో హీరోయిన్ శ్రద్ధ కపూర్ కూడా సాహో తో తెలుగు అభిమానుల్ని పలకరించింది.

వీరితో పాటు జక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రభాస్ తో ‘సాహో’ సినిమాతో తెలుగు అభిమానుల్ని మొదటి సారి పలకరించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేయబోయే ‘హరి హర వీరమల్లు’ సినిమాలో కూడా నటించనుంది అని వార్తలు వస్తున్నాయి. మరో వైపు మీడియం రేంజ్ హీరోయిన్స్ కూడా తెలుగు లో ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అనన్య పాండే తెలుగు లో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రానున్న ‘లైగర్’ సినిమాతో తెలుగు కి పరిచయం అవనుంది. ఈ లిస్ట్ లో ఇంకా దిశా పటాని, వాని కపూర్, జాన్వీ కపూర్ కూడా ఉన్నారు.

ఇలా మంచి అవకాశాల కోసమో లేదా మార్కెట్ పరిధి పెంచుకోవడం కోసమో ఇక్కడి హీరోలు , హీరోయిన్లు , డైరెక్టర్లు పక్క ఇండస్ట్రీస్ అలాగే పక్క ఇండస్ట్రీస్ నుండి ఇక్కడికి వచ్చి తమ టాలెంట్ ని నిరూపించుకుంటూ బాలన్స్ చేస్తున్నారు. ఒక రకంగా చూస్తే ఇది మంచి పరిణామమే అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా రీజనల్ కంటెంట్ కూడా గ్లోబల్ ఆడియెన్స్ కి రీచ్ అయ్యి కొత్త టాలెంట్ కి మంచి గుర్తింపు లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular