fbpx
HomeMovie Newsడుల్కర్ 'లెఫ్ట్నంట్ రామ్' ప్రీ లుక్

డుల్కర్ ‘లెఫ్ట్నంట్ రామ్’ ప్రీ లుక్

Duquer LatestMovieCharecter PreLookTeaser

టాలీవుడ్: మలయాళ నటుడు ‘దుల్కర్ సల్మాన్‘ మహానటి సినిమా ద్వారా ఒక ముఖ్య పాత్రతో తెలుగు వారికీ కూడా సుపరిచితుడయ్యాడు. ‘కనులు కనులని దోచాయంటే’ సినిమా ద్వారా ఇక్కడ కూడా మంచి టాక్ సంపాదించుకుని తర్వాత సినిమాలని కూడా డబ్ చేసుకుంటూ ఇక్కడ కూడా మార్కెట్ పెంచుకుంటున్నాడు. పాన్ ఇండియా హీరో ఇమేజ్ కోసం చూస్తున్న ఈ హీరో వేరే భాషల్లో కూడా డైరెక్ట్ సినిమాలు చేస్తూ జోరు చూపిస్తున్నాడు. ఇందులో భాగంగానే తెలుగు లో ‘యుద్ధం తో రాసిన ప్రేమ కథ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి మరో ప్రత్యేకత ఏంటంటే డైరెక్టర్ ‘హను రాఘవపూడి‘. హను సినిమాలు కలెక్షన్స్ అంతగా తీసుకురావుగాని సినిమాల్లో మాత్రం ఏదో ప్రత్యేకత ఉంటుంది.

హను దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాని ప్రతిష్టాత్మక బ్యానర్ వైజయంతి వారి ‘స్వప్న మూవీస్’ నిర్మాణంలో రూపొందిస్తున్నారు. ఈ మధ్యన ‘జాతి రత్నాలు’ ద్వారా సూపర్ సక్సెస్ సాధించిన ఈ బ్యానర్ ఇపుడు మరొక ఇంటెన్స్ లవ్ స్టోరీ ని ఇంకో వెర్సటైల్ డైరెక్టర్ హీరో కాంబినేషన్ లో రూపొందిస్తుండడం తో ఈ సినిమా పై అంచనాలు ఎక్కువవుతున్నాయి. ఈ సినిమాలో దుల్కర్ ‘లెఫ్ట్నంట్ రామ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఈ రోజు శ్రీ రామ నవమి సందర్భంగా రామ్ కి సంబందించిన ప్రీ లుక్ టీజర్ విడుదల చేసారు. ఈ వీడియో లో మద్రాస్ ఆర్మీ రెజిమెంట్ లో పని చేస్తూ యుద్ధం లో మరియు ప్రేమలో పోరాడే రామ్ ని ఆర్మీ యూనిఫామ్ లో చూపించారు కానీ ఫేస్ ఐతే రివీల్ చేయలేదు. ఇంకా నిర్మాణంలో ఉన్న ఈ సినిమా మిగతా వివరాలు మరి కొద్దీ రోజుల్లో వెల్లడించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular