fbpx
HomeMovie Newsనితిన్ 'మేస్ట్రో' లేటెస్ట్ పోస్టర్

నితిన్ ‘మేస్ట్రో’ లేటెస్ట్ పోస్టర్

Nithin MastroMovie LatestPoster

టాలీవుడ్: టాలీవుడ్ యువ హీరో నితిన్ ఈ సంవత్సరం ఫిబ్రవరి లో ‘చెక్’, మార్చ్ లో ‘రంగ్ దే’ సినిమాలతో పలకరించి ఒక హిట్ , ఒక ప్లాప్ సినిమాగా నిలిపాడు. ఈ హీరో నటిస్తున్న మరో సినిమా జూన్ నెలలో విడుదలకి సిద్ధం అవుతుంది. హిందీ లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందిన ‘అందాదున్’ సినిమాని తెలుగు లో ‘మాస్ట్రో’ టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ కి జోడీ గా నభ నటేష్ నటిస్తుంది. మరో ప్రత్యేకమైన అంట్రీ పాత్రలో తమన్నా నటిస్తుంది.

ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా నుండి పోస్టర్ విడుదల చేసింది సినిమా టీం. నితిన్ ని స్కూటీ పైన తీసుకువెళ్లే నభ ని ఈ పోస్టర్ లో చూడవచ్చు. ఈ సినిమాలో నితిన్ ఒక అంధుడిగా నటించబోతున్నట్టు తెలిసిన విషయమే. ‘వేంకటాద్రి ఎక్స్ప్రెస్’, ‘ఎక్స్ప్రెస్ రాజా’ సినిమాలని డైరెక్ట్ చేసిన ‘మేర్లపాక గాంధీ’ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. నితిన్ హోమ్ బ్యానర్ అయిన ‘శ్రేష్ట్’ మూవీ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భీష్మ సినిమాతో నితిన్ కి మ్యూజికల్ హిట్ ఇచ్చిన ‘మహతి స్వర సాగర్’ ఈ సినిమాకి కూడా సంగీతం ఇవ్వనున్నాడు. ఈ సినిమా తర్వాత నితిన్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ సినిమాలో నటించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular