fbpx
HomeMovie Newsవిశ్వక్సేన్ 'పాగల్' టీజర్

విశ్వక్సేన్ ‘పాగల్’ టీజర్

VishwakSen LatestMovie PagalTeaserReleased

టాలీవుడ్: వెళ్ళిపోమాకే అనే సినిమాలో సాఫ్ట్ కారెక్టర్ ద్వారా పరిచయం అయిన నటుడు విశ్వక్సేన్. తర్వాత ఈ నగరానికి ఏమైంది, ఫలక్నుమాదాస్ సినిమాల ద్వారా మాస్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. హిట్ అనే సినిమాతో ఒక ఇంటర్రోగాటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు. ఇప్పుడు తన నాల్గవ సినిమాగా ఒక పూర్తి లవ్ స్టోరీ తో వస్తున్నాడు. కానీ ఇది రొటీన్ లవ్ స్టోరీ కాకుండా పేరుకు తగ్గట్టు ఒక ‘పాగల్’ ని లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నట్టు టీజర్ లో తెలుస్తుంది. టీజర్ ని చూస్తుంటే పాగల్ టైటిల్ రోల్ విశ్వక్ పోషిస్తున్నట్టు అర్ధం అవుతుంది.

కనిపించిన అమ్మాయిలందరికి ప్రపోజ్ చేస్తూ చివరకి ఒక బామ్మకి కూడా ప్రపోజ్ చేస్తూ ‘పాగల్’ వెరైటీ గా కనిపించాడు. లవ్ స్టోరీ అని చెప్తూనే యాక్షన్ కూడా తక్కువ ఉండదు అన్నట్టు టీజర్ లో హింట్స్ ఇచ్చారు. ఈ సినిమాలో విశ్వక్ తో పాటు సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. విశ్వక్ సేన్ లుక్స్, కాస్ట్యూమ్స్ కూడా ఇదివరకు చూడని విధంగా ఉన్నాయి. రాడాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బెక్కెం వేణు గోపాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 30 న విడుదల చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular