fbpx
HomeMovie Newsవిరాట పర్వం: 'కొలు కొలు' పాట విడుదల

విరాట పర్వం: ‘కొలు కొలు’ పాట విడుదల

ViraataParvam KoluKolu SongReleased

టాలీవుడ్: రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా ‘విరాట పర్వం’. ‘నీది నాది ఒకే కధ‘ లాంటి కథా పరమైన సినిమాని రూపొందించిన డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. 1990 వ శకంలో జరిగిన నక్సలైట్ కామ్రేడ్ రవన్న జీవిత కధ ఆధారంగా పల్లె బతుకులు, వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ మంచి ఇంటెన్సిటీతో ఉండి ఆకట్టుకుంటున్నాయి. కృష్ణవంశీ ‘సిందూరం’, క్రిష్ ‘గమ్యం’ లాంటి సినిమాల తర్వాత మళ్ళీ అలాంటి జానర్ లో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా కూడా అలంటి క్లాసిక్స్ లో జాయిన్ అవుతుంది అని ఈ సినిమాపై అంచనాలు పెట్టుకుంటున్నారు సినీ అభిమానులు.

ఈ రోజు ఈ సినిమా నుండి ‘కోలు కోలు’ అంటూ సాగే ఒక పాట విడుదలైంది. పూర్తిగా జానపద పాదాల అల్లికతో కూడిన ఈ పాట విన్న వెంటనే అడిక్ట్ అయ్యే స్టేజ్ లో ఉంది. ఈ పాటని విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదల చేయించారు. వెంకటేష్ కూడా ఈ పాట మైండ్ లోంచి వెళ్లట్లేదు అని తన ఇష్టాన్ని వెళ్లబుచ్చారు. ఇంటెన్స్ కథలో ఒక మంచి లవ్ స్టోరీని ఈ సినిమాలో చూపించబోతున్నట్టు ఈ పాట ద్వారా తెలుస్తుంది.

‘ ‘స్త్రీ’ ప్రేమ, అనంతమైన కథనాలను నిశ్శబ్దంగానే ప్రపంచానికి అందిస్తుంది.. ఈ రోజు కొలు కొలు పాట ద్వారా వెన్నెల ప్రేమ కథనం’ అంటూ ఈ పాటని షేర్ చేసారు డైరెక్టర్ వేణు. సురేష్ బొబ్బిలి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఎస్.ఎల్.వీ సినిమాస్ బ్యానర్ పై సురేష్ బాబు మరియు సుధాకర్ చేకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 30 న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular