fbpx
HomeMovie Newsతెలుగు సినిమా పాపులారిటీ వెనుక 'సిద్' పాట

తెలుగు సినిమా పాపులారిటీ వెనుక ‘సిద్’ పాట

SidSriram SongsAs PromotionForMovie

టాలీవుడ్: ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ సినిమా చూసినా సిద్ శ్రీరామ్ పాట లేనిదే సినిమా లేదు అన్నట్టు ఉంది. ప్రతి సినిమా నుండి విడుదలయ్యే మొదటి పాట సిద్ శ్రీరామ్ ఆలపిస్తున్నాడు. చిన్న సినిమా నుండి పెద్ద సినిమాల వరకు అందరూ సిద్ శ్రీరామ్ ని తమ సినిమాల్లో పాడిస్తున్నారు, పాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సిద్ శ్రీరామ్ పాట సినిమాకి పాపులారిటీ తెచ్చి పెడుతుంది. కొన్ని సినిమాలు ఒక్క సిద్ శ్రీరామ్ పాట వల్లనే జనాల నోళ్ళలో నాని థియేటర్ల వరకు తీసుకువస్తున్నాయి. ఈ మధ్య విడువులైన ’30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా’ అనే సినిమా ‘పాటంత అందంగా ఉంటుంది మా సినిమా’ అంటూ సిద్ పాడిన పాట ద్వారా ప్రచారం కూడా చేసుకున్నారు.

సిద్ శ్రీరామ్ గీత గోవిందం లో ‘ఇంకేం ఇంకేం కావాలి’, ‘అల వైకుంఠపురం లో’ లో సామజవరాగమనా పాటల సక్సెస్ తర్వాత దాదాపు ప్రతి సినిమా ఫస్ట్ సింగిల్ సిద్ వాయిస్ నుండే విడుదల అవుతుంది. ఇప్పటికిప్పుడు టాలీవుడ్ లో వచ్చే రెండు నెలల్లో రాబోతున్న సినిమాల్లో సిద్ శ్రీరామ్ ఆలపించిన పాటలు ఉన్న సినిమాలు దాదాపు ఒక ఇరవై వరకు ఉంటాయి. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబిల్ బాచిలర్’, పవన్ కళ్యాణ్ ‘ వకీల్ సాబ్’, ‘SR కల్యాణ మండపం’, ‘శశి’, ‘నల్ల మల’, ‘అర్ద శతాబ్దం’, ‘www ‘, ‘ఇష్క్’, ‘వరుడు కావలెను’… లాంటి సినిమాల నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాటలు ప్రస్తుతం లిస్ట్ లో టాప్ లో ఉన్నాయి. ఇలా సిద్ శ్రీరామ్ పాడిన పాటల వలన సినిమా రీచ్ పెరుగుతునడం లో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular