fbpx
Saturday, July 27, 2024
HomeNationalసెప్టెంబర్ 1 నుంచి సంపూర్ణ అన్ లాక్?

సెప్టెంబర్ 1 నుంచి సంపూర్ణ అన్ లాక్?

UNLOCK-4-FROM-SEPTEMBER-1ST

న్యూ ఢిల్లీ: అన్‌లాక్ 4.0లో భాగంగా త్వ‌ర‌లోనే దేశంలో సినిమా థియేట‌ర్లు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇప్ప‌టికే అన్‌లాక్ ద‌శలో భాగంగా రెస్టారెంట్లు, మాల్స్, జిమ్, యోగాకేంద్రాల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే భార‌త్‌లో లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి సినిమా హాళ్లు మూత‌పడ‌టంతో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు భారీ న‌ష్టం వాటిల్లింది.

దీంతో ఆగ‌స్టు చివ‌రినాటికి అన్‌లాక్ 3.0 ముగియ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం సినిమా థియేట‌ర్లకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంద‌ని స‌మాచారం. సామాజిక దూరం, శానిటైజేష‌న్ వంటి నిబంధ‌న‌లు పాటిస్తూ సినిమా హాళ్లు తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించే అవ‌కాశం ఉంది. సీట్ల మ‌ధ్య దూరం, సీటింగ్ సామ‌ర్థ్యం వంటి వాటిపై ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేయ‌నుంది.

అంతేకాకుండా క‌రోనా వ్యాప్తి దృష్ట్యా టెంప‌రేచ‌ర్ కెపాసిటీ కూడా 24 డిగ్రీలు ఉండేలా దిశానిర్దేశం చేయ‌నుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్ప‌టికే 3డీ సినిమాల‌కు స్పెషల్ క‌ళ్ల‌జోడు ఉప‌యోగిస్తుండ‌గా, ప్రస్తుతం సినిమా చూస్తున్నంత‌సేపూ ప్రేక్ష‌కులు మాస్క్ ధ‌రించాల‌న్న నిబంధ‌న కూడా ఉండ‌నుంది.

ప్రతి షో తర్వాత సినిమా హాల్ ప్రాంగణాన్ని పూర్తిగా శానిటైజ్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి చేసేలా థియేట‌ర్ నిర్వాహ‌కులు చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే అన్‌లాక్‌లో భాగంగా జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చినందున సినిమా హాళ్లు కూడా తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుతివ్వాల‌ని ప‌లు థియేట‌ర్ యాజ‌మాన్యాలు ప్ర‌భుత్వానికి విజ్ఞప్తి చేశాయి.

కాంటాక్ట్‌లెస్ టికెటింగ్ , రెగ్యులర్ శానిటైజేషన్‌తో సినిమా హాళ్లు తిరిగి తెరవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి గైడ్‌లైన్స్‌ని విడుద‌ల చేస్తామ‌ని ఓ ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారి వెల్ల‌డించారు. అయితే మ‌ల్టీప్లెక్స్‌ల‌లో సినిమా హాళ్ల‌పై ఆంక్ష‌లు కొన‌సాగుతాయా లేదా అన్న‌దానిపై సందేహం నెల‌కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular