fbpx
Monday, November 4, 2024
HomeBig Storyకేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌-2022 ముఖ్యాంశాలు

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌-2022 ముఖ్యాంశాలు

UNION-BUDGET-2022-RELEASED-IN-PARLIAMENT

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్-2022ను ఇవాళ పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ ప్రవేశ పెట్టారు. ఆ బడ్జెట్ లోని కొన్ని ముఖ్యాంశాలు:

  • రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు కేటాయింపు
  • రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు
  • ఈ ఏడాది ద్రవ్యలోటు 6.9 గా ఉంటుందని అంచనా
  • 2023లో ద్రవ్యలోటు 6.4 గా ఉంటుందని అంచనా
  • 2022 మూలధన వ్యయం 35.4 శాతానికి పెంపు
  • రూ.7.50 లక్షల కోట్లు కేటాయింపు
  • ప్రతి తరగతికి ఒక టీవీ ఛానెల్‌ ద్వారా పాఠాలు, ప్రాంతీయ భాషల్లో పాఠాలు, ప్రస్తుతం 12 విద్యా టీవీ ఛానెల్స్‌ ఉండగా.. వీటిని 200 కి పెంపు
  • 2 లక్షల అంగన్వాడీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌
  • 75 జిల్లాల్లో 75 ఈ–బ్యాంకులు(డిజిటల్‌ బ్యాంక్స్‌)
  • అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్‌ సేవలు. డిజిటల్‌ పేమెంట్, నెట్‌ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు
  • ఇకపై డిజిటల్‌ పాస్‌పోర్టులు. చిప్‌ ఆధారిత పాస్‌పోర్టులు మంజూరు
  • పీఎం గృహ నిర్మాణ పథకానికి రూ.48 వేల కోట్ల కేటాయింపులు
  • ప్రధాని ఆవాస్‌ యోజన కింద 80 లక్షల ఇళ్లు నిర్మాణం
  • అర్బన్‌ ఏరియాలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులుగా షిప్స్‌ ఉపయోగిస్తాం
  • పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఉన్నత స్థాయి ప్యానెల్‌ ఏర్పాటు
  • వచ్చే 3 ఏళ్లలో 400 కొత్త వందే భారత్‌ రైళ్లు
  • దేశవ్యాప్తంగా వంద గతిశక్తి కార్గో టెర్మినల్స్‌ నిర్మాణం
  • 25 వేల జాతీయ రహదారుల నిర్మాణం
  • మేకిన్‌ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పన
  • డిజిటల్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు పూర్తి సహకారం
  • వంట నూనె దేశీయంగా ఉత్పత్తి చేసేలా చర్యలు
  • పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణాపై అధ్యయనం
  • రూ250 కోట్లుతో 5 విద్యా సంస్థల ఏర్పాటు
  • ఇకపై కేంద్ర మంత్రిత్వ శాఖల లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే
  • అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం
  • త్వరలో 5 జీ టెక్నాలజీ సేవలు, 2022 నాటికి 5 జి స్ప్రెక్టమ్‌ వేలం
  • 2025 నాటికి ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ పూర్తి
  • పీపీపీ రూపంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబులింగ్‌
  • ఎగుమతుల ప్రోత్సాహకానికి ఎస్‌ఈజెడ్‌లో సమూల మార్పులు
  • ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త చట్టం
  • రక్షణ రంగంలోనూ ఆత్మనిర్భర్‌ భారత్‌ అమలు
  • రక్షణ రంగంలో పరిశోధనలకు ప్రైవేట్‌ పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థలకు అవకాశం
  • డిఫెన్స్‌ బడ్జెట్‌లో 25 శాతం డిఫెన్స్‌ రీసెర్చ్‌ కోసం కేటాయింపులు
  • పర్యాటక ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి పనులు
  • ఎనిమిది పర్యాటక ప్రాంతాల్లో 60 కిమీ మేర రోప్‌వేలు
  • సోలార్‌ ఎనర్జీ ఉత్పత్తి కోసం రూ.19500 కేటాయింపులు
  • 10 రంగాల్లో క్లీన్‌ ఎనర్జీ యాక్షన్‌ ప్లాన్‌
  • ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్‌
  • వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్‌
  • పీపీపీ మోడల్‌లో ఆహార శుద్ధి పరిశ్రమలు
  • ఎస్‌సీ, ఎస్‌టీ రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
  • నిధుల సమీకరణకు సావర్‌ గ్రీన్‌ బాండ్ల
  • త్వరలో డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ
  • 2022–23లోనే అమల్లోకి డిజిటల్‌ కరెన్సీ
  • డిజిటల్‌ కరెన్సీ కోసం బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ
  • ఎలక్ట్రికల్‌ వాహనాలకు మరిన్ని ప్రోత్సాహకాలు
  • త్వరలో రహదారులపై బ్యాటరీలు మార్చుకునే సౌకర్యం
  • ప్రజారవాణాలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగానికి ప్రణాళికలు
  • పెట్రో డీజిల్‌ వినియోగాన్ని భారీగా తగ్గించే వ్యూహం
  • వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. వద్ధిరేటులో మనం ముందున్నామని
  • దేశ వ్యాప్తంగా కొత్తగా 25 వేల జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు నిర్మల తెలిపారు.
  • వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు అందిస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు.
  • చిన్న, మధ్యతరహా రైతుల కోసం వన్‌నేషన్‌ వన్‌ప్రొడక్ట్‌ పథకం అమలు
  • 2023 నాటికి 2 వేల కి.మీ రైల్వే లైన్లు పెంపు
  • రవాణ రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ.20 వేల కోట్టు కేటాయింపులు – భారత్‌లో అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలు కనెక్టివిటీ
  • వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు
  • చిన్న రైతులు, చిన్న పరిశ్రమలకు అనుగుణంగా రైల్వే నెట్‌వర్క్‌
  • వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్‌డ్రోన్‌లను అభివృద్ధి
  • దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయానికి ప్రొత్సాహం
  • కృష్ణా,పెన్నా,కావేరి నదుల అనుసంధానానికి ప్రణాళిక
  • ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఫైలింగ్‌ మరింత సులభతరం, రెండేళ్ల దాకా రిటర్స్‌ ఫైల్‌ చేసుకునే అవకాశం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular