మూవీడెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ స్పిరిట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని టి-సిరీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
ప్రస్తుతం వంగా, ముఖ్యమైన క్యాస్టింగ్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారని సమాచారం.
ప్రభాస్ అభిమానులు ‘స్పిరిట్’ మూవీపై ఆసక్తిగా ఉన్నారు.
డార్లింగ్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లలో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ మిగతా ప్రాజెక్ట్‌లకు కనిపించడం లేదు.
ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ‘ది రాజా సాబ్’ సినిమా చేస్తున్నాడు, దీని షూటింగ్ త్వరలోనే ముగిసే అవకాశం ఉంది.
ఇక హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ సినిమా ప్రభాస్ పాల్గొనని సన్నివేశాలతో మొదలైంది. 2025 ఆరంభంలో డార్లింగ్ ఇందులో పాల్గొననున్నట్లు టాక్.
ఈ సినిమా పూర్తయిన వెంటనే సమ్మర్ నుండి ‘స్పిరిట్’ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయంట.
ప్రభాస్, ఈ చిత్రానికి పూర్తి కాల్ షీట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.
‘స్పిరిట్’ కోసం ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపిస్తాడని, ఇది ఆయన కెరీర్ లో సరికొత్త అడుగు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ సినిమాను ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మార్చే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది.