fbpx
Saturday, April 20, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeNationalఅంతకంతకూ పెరుగుతున్న నిరుద్యోగ సమస్య!

అంతకంతకూ పెరుగుతున్న నిరుద్యోగ సమస్య!

UNEMPLOYMENT-RATE-IN-INDIA-RISING
  • దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య
  • జూలైలో 7.43 శాతం, ఆగస్టులో 8.35 శాతానికి పెరుగుదల
  • సెప్టెంబర్ లో ఇంకా పెరిగే అవకాశం
  • ఏపీలో 7.0 శాతం, తెలంగాణలో 5.8 శాతం నిరుద్యోగం
  • ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఎకానమీ’ సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌: భారత దేశంలో నిరుద్యోగ సమస్య క్రమక్రమంగా పెరుగుతూ పోతోంది. కరోనా‌ వ్యాప్తి పెరుగుతున్న తరుణంలో ఇది మరింత ఆందోళనకు గురి చేస్తోంది. పట్టణాల్లోని సంప్రదాయ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కోత, వ్యవసాయరంగంలో ఉపాధి తారా స్థాయికి చేరుకోవడంతో దేశవ్యాప్తంగా నిరుద్యోగ శాతం పెరుగుదలకు కారణమవుతోంది.

ఈ సంవత్సరం జూలైలో 7.43 శాతమున్న నిరుద్యోగ శాతం, ఆగష్టు నెలాఖరుకు 8.35 శాతానికి చేరింది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా భయపెడుతోంది. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంత తక్కువగానే ఉన్నా అక్కడ కూడా మెల్లమెల్లగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆగష్టులో పట్టణ ప్రాంతాల్లో 9.83 శాతం, గ్రామాల్లో 7.65 శాతం నిరుద్యోగం రికార్డయింది. అదే జూలై నెలలో పట్టణాల్లో 9.15 శాతంగా, గ్రామాల్లో 6.66 శాతంగా ఉంది.

ఇక సెప్టెంబర్ లోనూ వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగ శాతం ఇదే విధంగా కొనసాగడంతో పాటు ఆగష్టుతో పోల్చితే స్వల్పంగా పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అదీగాకుండా కరోనా వైరస్‌ దేశంలోకి అడుగుపెట్టడానికి ముందు జనవరిలో 7.76 శాతం, ఫిబ్రవరిలో 7.22 శాతమున్న నిరుద్యోగం కంటే ఇప్పుడు ఎక్కువగా ఉండటం, అది క్రమక్రమంగా పెరుగుతుండటం మరింత ఆందోళనకు కారణమవుతోంది.

కేంద్రం కఠినమైన లాక్‌డౌన్‌ నిబంధనల తర్వాత ఆగస్టు నెలలో వివిధ వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు అనుమతినిచ్చినా కూడా నిరుద్యోగ శాతం తగ్గకపోవడం ఆందోళనకరమేనని పలువురు ఆర్థికవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని నెలవారీ నిరుద్యోగ శాతానికి సంబంధించిన వివరాలను సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజా అధ్యయనంలో వెల్లడించింది.

కోవిడ్‌ పరిస్థితుల్లో తలెత్తిన ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాల కారణంగా వివిధ రాష్ట్రాల్లోని సంప్రదాయ, వ్యవస్థీకృత రంగాల్లో (ఫార్మల్‌ సెక్టార్‌) ఉద్యోగ, ఉపాధి తగ్గిపోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు. హరియాణాలో అత్యధికంగా 33.5 శాతం నిరుద్యోగం నమోదు కాగా, కర్ణాటకలో అత్యల్పంగా 0.5 శాతం రికార్డయింది. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 5.8 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 7 శాతం నిరుద్యోగమున్నట్టుగా సీఎంఐఈ గణాంకాలు తెలుపుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular