fbpx
HomeMovie News'తిట్టమ్ ఇరండు/ ప్లాన్ బి' పోలీస్ పాత్రలో ఐశ్వర్య రాజేష్

‘తిట్టమ్ ఇరండు/ ప్లాన్ బి’ పోలీస్ పాత్రలో ఐశ్వర్య రాజేష్

ThittamIrandu Trailer Release

కోలీవుడ్: పోలీస్ పాత్రల్లో హీరోయిన్ లు నటిస్తూ ఇప్పటి వరకు చాలానే సినిమాలు వచ్చాయి. ఈ మద్యే అమల పాల్ పోలీస్ పాత్రలో నటించి విడుదల అయిన ‘కుడి ఎడమైతే’ వెబ్ సిరీస్ కూడా మంచి టాక్ తో హిట్ సాధించింది. ఇపుడు మరో తమిళ్ హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించింది. వరల్డ్ ఫెమస్ లవర్ ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి సుపరిచితురాలు అయిన నటి ‘ఐశ్వర్య రాజేష్’. తమిళ్ లో వరుసగా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్న ఈ నటి మొదటి సారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. ఐశ్వర్య నటిస్తున్న ‘తిట్టమ్ ఇరండు/ ప్లాన్ బి’ అనే సినిమా ట్రైలర్ విడుదలైంది.

ఒక ప్రదేశంలో జరిగే రెండు హత్యలని ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఐశ్వర్య నటించనుంది. అసలు ఆ ప్రాంతంలో ఒక ఇంట్లో ఉండే వాళ్ళ గురించి ఇంకో ఇంటి వాళ్ళకి పెద్దగా తెలియదు. అంతే కాకుండా చనిపోయిన వాళ్ళకి తమ సమస్యలు ఏ స్టేజ్ లో ఉన్నాయి అన్న స్థితి లో కూడా లేదు. ఒక హత్య చేసిన దగ్గర ఎలాంటి ఆనవాళ్లు దొరకవు, మరొక హత్య జరిగిన దగ్గర కొన్ని ఆనవాళ్లు లభిస్తాయి. వీటిని బేస్ చేసుకుని మరి అది ఒకే హంతకుడు చేశాడా, ఈ హత్య కాబడిన వ్యక్తులకు ఏమైనా సంబందాలున్నాయా లాంటి ప్రశ్నలు వేసి ట్రైలర్ ముగించారు.

ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కావాల్సిన ఎలిమెంట్స్ ఐతే ఉన్నాయి కానీ అవి గ్రిప్పింగ్ గా ఎలా చూపించారు అనేదానిపైన సినిమా టాక్ ఆధారపడి ఉంటుంది. దినేష్ కణ్ణన్ మరియు వినోద్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు. విగ్నేష్ కార్తీక్ అనే డైరెక్టర్ రూపొందించిన ఈ సినిమా జులై 30 నుండి సోనీ LIV ఓటీటీ ఛానల్ లో స్ట్రీమ్ అవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular