fbpx
HomeMovie Newsఈ వారం రిలీజెస్

ఈ వారం రిలీజెస్

ThisWeek MovieReleases InOnlinePlatform

టాలీవుడ్: థియేటర్ లో ఈ వారం ఏ సినిమాలు విడులవుతున్నాయి అనే వార్త వినడం దగ్గరి నుండి ఓటీటీల్లో ఈ వారం ఏ సినిమాలు విడుదలవుతున్నాయి దగ్గరికి వచ్చాం. ఈ నెల చివరి వరకైనా థియేటర్లు తెరచుకుంటాయని ఆశిద్దాం. ఈ వారం రెండు క్రేజీ సినిమాలు ఓటీటీ లో విడుదలవుతున్నాయి.

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధనూష్ నటించిన ‘జగమే తంత్రం’. కరోనా వేవ్ 1 కన్నా ముందే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా అనేక కారణాల వలన వాయిదా పడుతూ ఎట్టకేలకు రేపు విడుదలవుతుంది. రజిని కాంత్ తో ‘పేట’ సినిమాని డైరెక్ట్ చేసిన ‘కార్తీక్ సుబ్బరాజ్‘ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో ఇండియా నుండి లండన్ వెళ్లి అక్కడ డాన్ అయ్యే పాత్రలో ధనూష్ కనిపిస్తున్నాడు. మరి ధనూష్ చేసే ప్రయత్నం డాన్ అవ్వడానికా లేదా అండర్ కవర్ కాప్ గా వెళ్తాడా అనేది రేపు సినిమా చూసాక తెలుస్తుంది. మామూలుగా ఓటీటీ లో విడుదలయ్యే సినిమాలు రాత్రి 12 గంటలకే విడుదల చేస్తారు. కానీ ఈ సినిమా రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి అందుబాటులో ఉండనుంది. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో ఈ సినిమా రేపు విడులవుతుంది.

హిందీ లో విద్యా బాలన్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘షెర్ని’ సినిమా కూడా రేపు విడుదలవుతుంది. ఈ సినిమాలో ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా విద్యా బాలన్ నటిస్తుంది. పులి ని పట్టుకునే ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో విద్య నటిస్తుంది. తాను వెళ్లిన చోట ఇలాంటి పనులకి లేడీ ఆఫీసర్ అవసరమా అనే మాటలు వింటుంది. చివరకి తాను పులి ని ఎలా పట్టుకుంది అనేది సినిమా కథాంశం అని అర్ధం అవుతుంది. కొంచెం ఫామిలీ ఎమోషన్స్ తో పాటు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమా రూపొందించినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. రేపు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో ఈ సినిమా విడుదలవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular