fbpx
HomeTelanganaతెలంగాణ సీఎస్ కు కరోనా పాజిటివ్!

తెలంగాణ సీఎస్ కు కరోనా పాజిటివ్!

TELANGANA-CS-TESTED-POSITIVE-TODAY-AFTER-COLLECTORS-MEET

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ కరోనా వైరస్‌ పాజిటివ్ గా పరీక్షింపబడ్డారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇవాళ ప్రకటించారు. ఈ మధ్యే చేయించుకున్న పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌ తేలిందని తెలిపారు. ఆయన కాస్త అనారోగ్యానికి గురి కావడంతో పరీక్షలు చేయించుకున్నానని, పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు.

కాగా తనకు కరోనా లక్షణాలు ఏవీ లేవని సోమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తనను ఇటీవల కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. పాజిటివ్‌ రిజల్ట్ కు ముందు సీఎస్‌ సోమేశ్‌ కుమార్ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు ఆదేశాలు కూడా జారీ చేశారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా భేటీ అయినట్లు తెలుస్తోంది. కాగా సీఎస్‌కు కరోనా సోకడంతో కొంత ఆందోళన కలుగుతోంది. ఇక రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు రెండు వేలకు చేరువగా కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular