fbpx
Tuesday, April 16, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeNationalప్లాంట్ సైన్స్ లో పీ హెచ్ డీ కి 1.3 కోట్ల స్కాలర్ షిప్

ప్లాంట్ సైన్స్ లో పీ హెచ్ డీ కి 1.3 కోట్ల స్కాలర్ షిప్

SUMANTH-BINDAL-LPU-AUSTRALIA-SCHOLARSHIP

న్యూఢిల్లీ: సుమంత్‌ బిందాల్‌ అనే యువకుడు లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ (ఎల్‌పీయూ)లో వ్యవసాయ రంగంలో ప్రత్యేకంగా జన్యుశాస్త్రం, మొక్కల పెంపకంలో మాస్టర్స్‌ ఆఫ్‌ సైన్స్‌ చదువుతున్నాడు. ఆ విద్యార్థికి ప్లాంట్స్‌ సైన్స్‌ అంశంలో ఆస్ట్రేలియాలో పీహెచ్‌డీ చేసేందుకు గాను 1.3 కోట్ల రూపాయలు ఫుల్‌ పెయిడ్‌ స్కాలర్‌షిప్‌ లభించింది.

ఈ రంగంలో ఇంతవరకు ఎవైకి ఇంత మొత్తం లో స్కాలర్‌షిప్‌ దక్కలేదు. ఈ క్రమంలో బిందాల్‌కు ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ(ఏఎన్‌యూ)లో పీహెచ్‌డీ చేయడానికి స్కాలర్‌షిప్‌ లభించింది. దీనితో బిందాల్‌ టమోటా మొక్కలను నాశనం చేసే ఫ్యూసేరియం అనే ఫంగస్‌ గురించి పరిశోధన చేయాలి. ఈ ఫంగస్‌ వల్ల ఏటా భారతదేశంలో టమోటా రైతులు 45శాతం దిగుబడిని నష్టపోతున్నారు.

ఈ సందర్భంగా సుమంత్ బిందాల్‌ మాట్లాడుతూ ‘ఈ స్కాలర్‌షిప్‌ అందుకోవడ చాలా సంతోషఒగా ఉంది. ఏఎన్‌యూ ప్రపంచంలోని ప్రముఖ పరిశోధనా సంస్థల్లో ఒకటి. ఆ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేయాలనేది నా జీవిత ఆశయం. ఇందుకు గాను నాకు ఎంతో సహకరించిన నా కుటుంబ సభ్యులకు, నా అధ్యాపకులకు మరియు సలహాదారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular