fbpx
HomeMovie Newsశివరాత్రి కి 'గాలి సంపత్' విడుదల

శివరాత్రి కి ‘గాలి సంపత్’ విడుదల

SriVishnu GaaliSampath forShivarathriRelease

టాలీవుడ్: వైవిధ్య కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీ విష్ణు. శ్రీ విష్ణు హీరోగా ప్రస్తుతం రూపొందుతున్న సినిమా ‘గాలి సంపత్’. ఈ సినిమాలో శ్రీ విష్ణు ట్రక్ డ్రైవర్ గా నటిస్తున్నాడు. ఇందులో మరో ముఖ్య పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నాడు. విశేషం ఏంటంటే టైటిల్ రోల్ లో రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రముఖ డైరెక్టర్ ‘అనిల్ రావిపూడి’ సమర్పణలో రూపొందుతుంది. అంతే కాకుండా ఈ సినిమాకి కథ సహకారం మరియు దర్శకత్వ పర్యవేక్షణ కూడా అనిల్ రావిపూడి చేసాడు.

ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ మధ్యనే షూటింగ్ మొదలైన ఈ సినిమా అప్పుడే విడుదల తేది కూడా ప్రకటించి ఆశ్చర్య పరచారు. మహా శివరాత్రి సందర్భంగా మార్చ్ 11 న ఈ సినిమా విడుదల అవబోతున్నట్టు సినిమా టీం ప్రకటించింది. మజిలీ లాంటి సినిమాని రూపొందించిన ‘షైన్ క్రియేషన్స్’ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతుంది. మార్చ్ 11 న ఈ సినిమాతో పాటు శర్వానంద్ శ్రీకారం కూడా విడుదల అవబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular