fbpx
HomeMovie Newsమార్చ్ లో శర్వానంద్ 'శ్రీకారం'

మార్చ్ లో శర్వానంద్ ‘శ్రీకారం’

Sharwanand SreekaramMovie ReleaseDateAnnounced

టాలీవుడ్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘శ్రీకారం’. ఒక పూర్తి ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకి సంబందించిన విడుదల తేది మూవీ మేకర్స్ ప్రకటించారు. మహా శివరాత్రి సందర్భంగా మార్చ్ 11 న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. 14 ప్లస్ రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బి. కిషోర్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి మాటలు అందించారు.

తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందించబడింది. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి అందించిన సంగీతం ఆకట్టుకుంది. ఈ సినిమా నుండి విడుదలైన ‘వస్తా నంటివో పోతా నంటివో’ అనే ఫోక్ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో శర్వానంద్ కి జోడీ గా ‘గ్యాంగ్ లీడర్’ లో నటించిన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. శతమానం భవతి తర్వాత శర్వానంద్ మరో సారి ఫామిలీ ఎంటర్టైనర్ ని నమ్ముకుని ఈ సినిమా చేస్తున్నాడు. వరుస ప్లాపుల్లో ఉన్న ఈ హీరో ఈ సినిమా పైన గట్టి నమ్మకాన్ని పెట్టుకున్నాడు. తన కెరీర్ లో న్యూ ఫేజ్ ఈ సినిమా తో ప్రారంభం అవుతుంది అని చెప్పి ట్వీట్ చేసి ఈ సినిమా విడుదల తేది ప్రకటించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular