టాలీవుడ్: మెగా బ్యాక్ గ్రౌండ్ తో హీరోగా గా ప్రయాణం ప్రారంభించి మాస్ మూసలో పడకుండా కథకి ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ‘వరుణ్ తేజ్‘. తన రెండవ సినిమానే ‘కంచె’ లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా తీసి తన దారి వేరు అని నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు 9 సినిమాల్లో నటించిన ఈ హీరో ఒక రెండు మూడు ప్లాప్ సినిమాలు తప్ప మిగతా సినిమాలన్నీ బాగానే ఆడాయి. వరుణ్ తేజ్ ప్రస్తుతం తన 10 వ సినిమాగా ఒక స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ రోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన టైటిల్ అంనౌన్స్మెంట్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
వరుణ్ తేజ్ 10 వ సినిమా ‘గని’ అని టైటిల్ తో పాటు బాక్సింగ్ రింగ్ లో ఫైట్ చేస్తున్న వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. మెగా హీరోల్లో పవన్ కళ్యాణ్ ఇదివరకు ‘తమ్ముడు’ అనే సినిమాలో బాక్సర్ గా నటించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మెగా ఫామిలీ నుండి స్పోర్ట్స్ బేస్డ్ సినిమా రాబోతుంది. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో అల్లు అర్జున్ సోదరుడు అల్లు వెంకటేష్ మరియు సిద్ధు ముద్ద కలిసి నిర్మిస్తున్నారు. ‘కిరణ్ కొర్రెపాటి’ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మోషన్ పోస్టర్ లో థమన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. ఈ సినిమాలో కొన్ని ముఖ్య పాత్రల్లో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ ఆక్టర్ సునీల్ శెట్టి ,జగపతి బాబు, నవీన్ చంద్ర నటించనున్నారు. ఈ సినిమాని జులై లో విడుదల చేయనున్నట్టు కూడా మేకర్స్ ప్రకటించారు.