fbpx
HomeMovie Newsబ్రదర్స్ అఫ్ టాలీవుడ్

బ్రదర్స్ అఫ్ టాలీవుడ్

specialArticle on TollywoodBrothers

టాలీవుడ్: ఈరోజు నేషనల్ బ్రదర్స్ డే సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న బ్రదర్స్ గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ రాస్తున్నాం. ఇప్పుడంటే చాలా మంది బ్రదర్స్ హీరోలుగా చేస్తున్నారు కానీ ఎన్టీఆర్ కాలం నుండే ఇండస్ట్రీ లో బ్రదర్స్ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకుసాగారు.

సీనియర్ ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కొనసాగుతున్నప్పుడు అతని సోదరుడు నిర్మాతగా ఎన్నో సినిమాలు ఎన్టీఆర్ తో నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు కూడా నిర్మాతగా కూడా కృష్ణ తో చాలా సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం ఈ కుటుంబాల నుండి ఉన్న తర్వాత జెనెరేషన్ స్టార్స్ మహేష్ బాబు- రమేష్ బాబు మరియు జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ ఇదే ఫాలో అవుతున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూనే ఎన్టీఆర్ తో సినిమాలు నిర్మిస్తున్నాడు.

టాలీవుడ్ లో బ్రదర్స్ అనగానే ముందు వినిపించే పేరు మెగా బ్రదర్స్. ఇపుడు మెగా ఫామిలీ లో చాలా బ్రదర్స్ ఉన్నారు కానీ మొదటి తరం బ్రదర్స్ చిరంజీవి, నాగ బాబు, పవన్ కళ్యాణ్ చాలా స్పెషల్. చిరంజీవి, పవన్ కళ్యాణ్ హీరోలుగా బాగా సక్సెస్ అవుతుండగా వారి వెనకుండి కొన్ని సినిమాలని నిర్మిస్తూ , ఫ్యాన్ బేస్ కి హీరోలకి కమ్యూనికేషన్ ని సమన్వయపరుస్తూ మెగా కుటుంబం మొత్తం ఇపుడు ఇండస్ట్రీ లో సక్సెస్ అవడానికి నాగబాబు ఎంతో కృషి చేసారు. వీళ్ళ తర్వాత రామ్ చరణ్ – వరుణ్ తేజ్ ,బ్రదర్స్ సాయి ధరమ్ తేజ్- లేటెస్ట్ సెన్సేషన్ వైష్ణవ తేజ్ మెగా ఫామిలీ బ్రదర్స్ గా ఇండస్ట్రీ లో సక్సెస్ అవుతున్నారు. మెగా ఫామిలీ నుండి ఉన్న మరో బ్రదర్స్ అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ. అల్లు బాబీ నిర్మాతగా కొనసాగుతుంటే, అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా సినిమాలు, శిరీష్ హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇండస్ట్రీ లో ఉన్న దగ్గుబాటి బ్రదర్స్ వెరీ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. రామానాయుడు లెగసీ ని కంటిన్యూ చేస్తూ సురేష్ బాబు నిర్మాతగా, వెంకటేష్ హీరోగా ఎలాంటి వివాదాలు లేకుండా మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. వీళ్ళ తర్వాత జెనెరేషన్ లో రానా హీరోగా, ప్రొడ్యూసర్ గా , విలన్ గా, కారెక్టర్ ఆర్టిస్ట్ గా కొత్త కొత్త సినిమాలతో, ప్రయోగాలతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ దూసుకెళ్తున్నారు. రానా బ్రదర్ అభిరాం హీరోగా మొదటి సినిమా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరితో పాటు అక్కినేని బ్రదర్స్ నాగ చైతన్య, అఖిల్ లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. వరుస హిట్లతో నాగ చైతన్య టాప్ లీగ్ కి దూసుకెళ్లే స్టేజ్ లో ఉండగా అఖిల్ తొలి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు.

వీళ్ళే కాకుండా మంచు బ్రదర్స్ విష్ణు- మనోజ్, అల్లరి నరేష్ – ఆర్యన్ రాజేష్, రవితేజ – రఘు , విజయ్ దేవరకొండ – ఆనంద్ దేవరకొండ ఇలా చాలా మంది బ్రదర్స్ ఇండస్ట్రీ లో ఒకరికి కోసం ఒకరు తోడ్పడుతూ తమ సినిమాలతో పాటు సినిమా ఇండస్ట్రీ సక్సెస్ కోసం కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. వీళ్ళే కాకుండా ఇంకా ఎంతో మంది తోటి నటుల్ని, టెక్నీషియన్స్ ని తమ బ్రదర్స్ లాగా ట్రీట్ చేస్తూ ఇండస్ట్రీ లో ముందుకు సాగుతున్నారు. వాళ్లందరికీ బ్రదర్స్ డే విషెస్ తెలియచేస్తూ ఎంతో మంచి సినిమాలని రూపొందించి సినిమా అభిమానుల్ని అలరించాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular