fbpx
HomeMovie News'వరల్డ్ ఫేమస్ లవర్' లుక్ లో యువ హీరో

‘వరల్డ్ ఫేమస్ లవర్’ లుక్ లో యువ హీరో

ShivaKandukuri ManuCharitra FirstLook

టాలీవుడ్: పోయిన సంవత్సరం ఫిబ్రవరి లో విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా హీరో విజయ్ దేవరకొండకి, ప్రొడ్యూసర్ కే.ఎస్. రామారావు గారికి తీవ్ర నష్టాలు మిగిల్చింది. ప్రస్తుతం ఒక యువ హీరో రూపొందుతున్న సినిమా పోస్టర్స్ చూస్తుంటే అవే లుక్స్ కనిపిస్తున్నాయి. పెళ్లి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి ‘చూసి చూడంగానే’ అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం అయ్యాడు. శ్రియ ముఖ్య పాత్రలో నటిస్తున్న ‘గమనం’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ హీరో నటించబోతున్న మరో సినిమా ఈ మధ్యనే అనౌన్స్మెంట్ జరిగింది. కాజల్ అగర్వాల్ సమర్పణలో రూపొందబోతున్న ‘మను చరిత్ర’ అనే సినిమాలో శివ కందుకూరి హీరోగా నటిస్తున్నారు.

ఈ రోజు శివ కందుకూరి హీరో గా నటిస్తున్న ‘మను చరిత్ర‘ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. పూర్తిగా దెబ్బలు తిని చేతిలో ఒక రోజా పువ్వు పట్టుకుని బైక్ పై వెళ్లే లుక్ ఒకటి సినిమా టీం విడుదల చేసింది. ప్రేమలో పడడం అనేది ఒక బాధాకరమైన ఆనందం అనే టాగ్ లైన్ తో ఒక రొమాంటిక్ బ్రేకప్ డ్రామాని రూపొందించబోతున్నట్టు మేకర్స్ హింట్ ఇచ్చారు. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆపిల్ ట్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎన్.శ్రీనివాస్ రెడ్డి, పి.రోన్సన్ జోసెఫ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భరత్ పేదగాని అనే దర్శకుడు ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular