fbpx
HomeMovie Newsతిమ్మరుసు గా సత్యదేవ్

తిమ్మరుసు గా సత్యదేవ్

Satyadev NewMovieThimmarusu ShootingStarted

టాలీవుడ్: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయాణం ప్రారంభించి ఇప్పుడిప్పుడే మంచి నటుడిగా పేరు సంపాదించుకుంటున్న లేటెస్ట్ టాలీవుడ్ స్టార్ ‘సత్యదేవ్‘. అంచెలంచెలుగా ఎదుగుతూ ‘జ్యోతి లక్షి’, ‘బ్లఫ్ మాస్టర్’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ లాంటి సినిమాల ద్వారా నటుడిగా చాలా ప్రశంసలు పొందిన ఈ హీరో మరో కొత్త సినిమా మొదలు పెట్టాడు. ఈ రోజే షూటింగ్ ప్రారంభం ఐన ఈ సినిమా పేరు ‘తిమ్మరుసు’. ‘అసైన్మెంట్ కావాలి’ అనే టాగ్ లైన్ తో ఈ సినిమా రాబోతోంది.

ఎస్ ఒరిజినల్స్ మరియు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సృజన్ ఎరబోలు , మహేష్ కోనేరు కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శరన్ కొప్పిశెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ పోతున్న సత్యదేవ్ ని మరో సరికొత్త కథతో అలరించే విధంగా ఈ సినిమా కథ ఉందని సినిమా మేకర్స్ చెప్పారు.ఈ సినిమాలో సత్యదేవ్ కి జోడీ గా ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ నతిసుంది. ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థం లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. దీనితో పాటు సత్యదేవ్ కన్నడ లో సూపర్ హిట్ అయిన ‘లవ్ మోక్టైల్’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సత్యదేవ్ తో పాటు తమన్నా నటిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular