fbpx
Thursday, March 28, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeMovie Newsఅక్టోబర్ 23 న 'రాధే శ్యామ్' మోషన్ పోస్టర్

అక్టోబర్ 23 న ‘రాధే శ్యామ్’ మోషన్ పోస్టర్

Radheshyam MotionPosterOn October23rd

టాలీవుడ్: టాలీవుడ్ హీరో అనడం కన్నా ఇపుడు పాన్ ఇండియా హీరో అంటే బాగుంటుందేమో.. బాహుబలి తర్వాత తన రేంజ్ అమాంతం పెచుకున్న హీరో ప్రభాస్. బాహుబలి తర్వాత తీసిన ‘సాహో’ సినిమా తెలుగులో యావరేజ్ టాక్ వచ్చిన కూడా బాలీవుడ్ లో హిట్ టాక్ తో నడిచింది. ఇది ఒక్కటి చాలు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అని చెప్పడానికి. ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలు ప్రకటించాడు. అందులో షూటింగ్ లో ఉన్న సినిమా మాత్రం ‘రాధే శ్యామ్’. అక్టోబర్ 23 న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబందించిన యాక్టర్స్, టెక్నిషియన్స్ వివరాలు అన్నీ చెప్పారు కానీ ఈ సినిమాకి సంగీతం ఎవరు అందిస్తున్నారని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.
ఏ ఆర్ రెహమాన్ అని, డియర్ కామ్రేడ్ ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్ అని ఇలా చాలా పేర్లు వినిపించాయి కానీ ఏది క్లారిటీ లేదు. ‘బీట్స్ అఫ్ రాధే శ్యామ్’ అంటూ కూడా ఒక పోస్టర్ విడుదల చేసారు. అందు వల్ల అదే రోజు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు మోషన్ పోస్టర్ తో చిన్న మ్యూజిక్ ట్రాక్ కూడా విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు అని అర్ధం అవుతుంది. ఈ సినిమాని రొమాంటిక్ లవ్ స్టోరీ గా రూపొందిస్తున్నారు కాబట్టి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. దాని కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular