fbpx
HomeMovie Newsకొత్తగా ప్రయత్నించబోతున్న మెగా హీరో

కొత్తగా ప్రయత్నించబోతున్న మెగా హీరో

SaiDharamTej NewMovieUnder SukumarWritings

టాలీవుడ్: చిరంజీవి మేనల్లుడిగా సినీ ప్రస్తానం ప్రారంభించి మొదట్లో వరుస హిట్లు కొట్టి మంచి ఫేమ్ సంపాదించాడు సాయి ధరమ్ తేజ్. తర్వాత వరుస ప్లాప్ లతో డీలా పడినా మళ్ళీ చిత్రలహరి, ప్రతి రోజు పండగే సినిమాలతో కం బ్యాక్ అయ్యాడు. ఇప్పుడు వరుసగా సినిమాలని లైన్ లో పెడుతున్నాడు ఈ మెగా హీరో. ప్రస్తుతం ఈ మెగా హీరో కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ ముగింపు దశకు వచ్చిన ఈ సినిమా ఈ వేసవి లో విడుదల అవ్వాల్సింది. కానీ కరోనా వల్ల వేచి చూడాల్సి వచ్చింది. ఈ సినిమా ఓటీటీ లో విడుదల చెయ్యబోతున్నారు అని వార్తలు కూడా వచ్చాయి కానీ అధికారిక ప్రకటన ఏదీ అయితే లేదు.

అలాగే మరో డైనమిక్ డైరెక్టర్ ‘దేవా కట్ట‘ తో మరో సినిమా చెయ్యబోతున్నాడు ఈ హీరో. ఆ సినిమా కూడా సాయి ధరమ్ తేజ్ ఇదివరకు ట్రై చెయ్యని సబ్జెక్టు అని చెప్పారు. ఈ రోజు ఈ హీరో నుండి మరొక సినిమా ప్రకటన వచ్చింది. సుకుమార్ రైటింగ్స్ పేరు తో సుకుమార్ కథలు అందించి తన శిష్యులతో సినిమాలు తీస్తున్నాడు. సాయి తేజ్ ఇవాళ ప్రకటించిన సినిమా కూడా సుకుమార్ రైటింగ్స్ నుండి రాబోతుంది. ఈ సినిమా ‘మిస్టిక్ థ్రిల్లర్’ జానర్ లో రాబోతోందని ప్రకటించారు. ఈ జానర్ లో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. ఈ మధ్య కాలం లో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఒక్కటే ఈ జానర్ లో వచ్చి ఘన విజయం సాధించింది. ప్రస్తుతం సాయి తేజ్ కొత్త కొత్త సినిమాలు ట్రై చేస్తూ కెరీర్ ని గాడిలో పెట్టే పనిలో ఉన్నాడు. సాయి ధరమ్ తేజ్ 15 వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు కార్తీక్ దర్శకత్వం చేయబోతుండగా, సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఎస్వీసిసి బ్యానర్ పై భోగవల్లి ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular