fbpx
HomeMovie NewsKGF2 - రవీనా టాండన్ ఫస్ట్ లుక్

KGF2 – రవీనా టాండన్ ఫస్ట్ లుక్

RaveendaTandan FirstlookFrom KGFChapter2

కోలీవుడ్: ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి దాదాపు అన్ని సౌత్ మరియు హిందీ భాషల్లో ఊహకందని విజయం సాధించిన సినిమా ‘కెజిఎఫ్’. ఈ సినిమా ద్వారా హీరో యష్ ఒకేసారి పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. దక్షిణ భారత దేశంలోని కోలార్ గోల్డ్ మైన్స్ లో ఒక కల్పిత కథని రాసుకుని దానికి అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇపుడు రెండవ పార్ట్ ని ‘కెజిఎఫ్ చాప్టర్ 2 ‘ పేరుతో తీస్తున్నాడు. ఈ సినిమానుండి ఇప్పటికే హీరో గా నటిస్తున్న యష్ లుక్ అలాగే విలన్ గా నటిస్తున్న సంజయ్ దత్ ‘అధీరా’ లుక్ బాగా ఫేమస్ అయ్యాయి. కరోనా రాకపోయి ఉంటె ఈపాటికి ఈ సినిమా విడుదల అయ్యి ఉండేది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కి లేదా వేసవిలో విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎపుడు విడుదల చేసిన కానీ సూపర్ హిట్ అయ్యే సూచనలు అయితే కనపడుతున్నాయి.

ఈ సినిమాలో మరొక ముఖ్య పాత్రలో ఒకప్పటి హీరోయిన్ ‘రవీనా టాండన్‘ కూడా నటిస్తుంది. నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా తన పాత్రకు సంబందించిన ఫస్ట్ లుక్ ఒకటి విడుదల చేసింది సినిమా టీం. కెజిఎఫ్ చాప్టర్ 2 సినిమానుండి తన పాత్ర ‘రమిక సేన్’ కి సంబందించిన పోస్టర్ విడుదల చేసింది. పోస్టర్ ని చూస్తుంటే ఈ సినిమాలో రవీనా టాండన్ ఒక రాజాకీయ వేత్తగా కనిపిస్తుంది. ఈ సినిమాలో తాను ఒక మహిళా శక్తి గా కనిపిస్తున్నట్టు పోస్టర్ చూస్తే అర్ధం అవుతుంది. మొన్ననే కాన్సర్ ని జయించి సంజయ్ దత్ కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు. మరొక ముఖ్య పాత్రలో ప్రకాష్ రాజ్ కూడా కనిపించబోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular